కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు.. చచ్చేది లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. ఈ రోజు గజ్వేల్ లో జరిగిన పార్టీ ప్రచార సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 24 ఏళ్లుగా తెలంగాణే తన ఆశ, శ్వసగా బతుకుతున్నానన్నారు. ఉద్యమ సమయంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని నిల్చున్నానన్నారు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ (Congress Party) మోసం చేస్తే ఆమరణ నిరాహర దీక్షకు దిగి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. 33 పార్టీలు మద్దతు ప్రకటించిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారన్నారు. కానీ ఈ రాజ్యం ఎవరికి రావాలి? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ (NTR) అధికారంలోకి వచ్చి రూ.2 కే కిలో బియ్యం ఇచ్చే వరకు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఆఖలికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేదన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆఖలి చావులు అని అన్నారు. ఎమర్జెన్సీ వస్తుందన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆఖలి చావులు అని అన్నారు. ఎమర్జెన్సీ వస్తుందని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Breaking:తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ సందేశం
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు సిద్దిపేట తనకు బలం ఇచ్చిందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గజ్వేల్ తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కల్పించిందన్నారు. ఈ ప్రాంతం తన గౌరవాన్ని పెంచి.. ఈ స్థాయికి తెచ్చిందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేశానన్నారు. తాగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించానన్నారు. ఇక్కడికి ప్రాజెక్టులు, కాల్వలు వచ్చాయన్నారు. ఎవరూ ఊహించని విధంగా గజ్వేలుకు రైలు కూడా వచ్చిందన్నారు. ఇక్కడి అభివృద్ధిని చూసేందుకు ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా వచ్చిపోయిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, అడవుల పునరుద్ధరణ, మల్లన్న సాగర్ ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు కూడా గజ్వేల్ నుంచే వెళ్తోందన్నారు.
ఇది కూడా చదవండి: ఓటు వెయ్యకపోతే సచ్చిపోతా.. కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
వ్యవసాయ రంగం అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో అద్భుతమైన ఫలితాలు వచ్చాయన్నారు. తెలంగాణలో రైతులకు ఫ్రీగా కాల్వల ద్వారా నీరు ఇస్తున్నామన్నారు. 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామన్నారు. రైతు బంధును పుట్టించిందే కేసీఆర్ సర్కార్ అని అన్నారు. రైతు అనుకోకుండా చనిపోతే రైతు భీమా ద్వారా ఆదుకుంటున్నామన్నారు. 7500 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లను చేపట్టామన్నారు. ధరణి ద్వారా రైతుల భూములకు రక్షణ కల్పించామన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధును రూ.16 వేలు చేస్తామన్నారు. 24 గంటల కరెంట్ ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్ రావాలన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పినట్లు 3 గంటల కరెంట్, 10HP మోటర్లు నడిస్తే ట్రాన్స్ ఫార్మర్లు, సబ్ స్టేషన్లు పటాకులు పేలినట్లు పేలుతాయన్నారు.