CM KCR: మాట తప్పిన జానారెడ్డిని ప్రజలే ఓడించిండ్రు: హాలియా సభలో కేసీఆర్ సెటైర్లు

రెండేళ్లలో 24 గంటల కరెంట్ ఇస్తే టీఆర్ఎస్ లో చేరుతానని నాడు ప్రకటించిన జానారెడ్డి మాట తప్పారని సీఎం కేసీఆర్ అన్నారు. దీంతో ప్రజలే ఆయనను ఓడించారన్నారు. ఈ రోజు హాలియాలో జరిగిన బీఆర్ఎస్ ఎన్నికల సభలో కేసీఆర్ పాల్గొన్నారు. నోముల భగత్ ను మరోసారి గెలిపించాలని కోరారు.

New Update
CM KCR: మాట తప్పిన జానారెడ్డిని ప్రజలే ఓడించిండ్రు: హాలియా సభలో కేసీఆర్ సెటైర్లు

ఎన్నికల ప్రచారంలో భాగంగా హాలియాలో జరిగిన నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో నేను రెండేళ్లలో 24 గంటల కరెంట్ ఇస్తానని ఆనాడు అసెంబ్లీలో చెబితే నాటి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జానారెడ్డి (Jana Reddy) రెండేంళ్లలో కాదు.. నాలుగేళ్లలో ఇచ్చినా కూడా నా మెడలో కాంగ్రెస్ కండువా తీసి గులాబీ కండువా కప్పుకుంటానన్నరని గుర్తు చేశారు. తాను ఇచ్చిన మాట మీద నిలబడి రెండేళ్లలో 24 గంటల కరెంటు ఇచ్చానన్నారు. కానీ జానారెడ్డి మాత్రం తన మాట మీద నిలబడలేదన్నారు.
ఇది కూడా చదవండి: KTR: కాంగ్రెస్ కు కర్ణాటక నుంచి పైసలు.. నకిరేకల్ లో కేటీఆర్ సంచలన ఆరోపణలు!

జానారెడ్డి మన పార్టీకి మారలేదు.. మన కండువా కప్పుకోలేదు.. ఉల్టా పోయిన ఎన్నికల్లో మన భగత్ మీద నిలబడితే ఈ నియోజకవర్గ ప్రజలే ఓడించారని ఎద్దేవా చేశారు. మంచి ఉత్సాహవంతుడు, విద్యావంతుడు, వినయం ఉన్న భగత్ ఎమ్మెల్యేగా గెలిస్తే కుల మతాలకు అతీతంగా నాగార్జున సాగర్ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు కేసీఆర్. భగత్ ను గుండెలకు హత్తుకొని గెలిపించాలని కోరారు. మీ అభివృద్ధి నా బాధ్యత అని హామీ ఇచ్చారు.

ఈ రోజు నాగార్జున సాగర్ తో పాటు ఇబ్రహీంపట్నం, పాలకుర్తిలో జరిగిన ప్రచార సభలకు కూడా కేసీఆర్ హాజరయ్యారు. తెలంగాణ‌కు ఒక్క మెడిక‌ల్ కాలేజీ, న‌వోద‌య పాఠ‌శాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని ఆ పార్టీ ఓట్లు అడుగుతదని ఫైర్ అయ్యారు.

Advertisment
తాజా కథనాలు