TS Elections 2023: బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ.. బీఎస్పీతోనే అన్ని వర్గాలకు న్యాయం: మాయావతి

ఈ రోజు పెద్దపల్లిలో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. బీఎస్పీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ ను సీఎం చేయాలని ఓటర్లను కోరారు.

New Update
బీఆర్ఎస్‌.. భ్రష్టాచార్‌ సర్కార్‌: సూర్యాపేట సభలో మాయావతి ఫైర్

అన్ని సామాజిక వర్గాల వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఎస్పీ (BSP) అని ఆ పార్టీ అధినేత్రి మాయావతి (Mayavathi) అన్నారు. ఈ రోజు పెద్దపల్లి జిల్లాలో బీఎస్పీ అభ్యర్థుల గెలుపు కోసం ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.. మండల్ కమిషన్ ను ఆపింది కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అది ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) దళిత వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై బీఆర్ఎస్ సర్కార్ అక్రమంగా ఎఫ్‌ఐఆర్ లు నమోదు చేసిందన్నారు.
ఇది కూడా చదవండి: Telangana Elections: బాబోయ్ అన్ని కోట్లా?.. వివేక్‌కు ఈడీ బిగ్ షాక్.. డ్రామా మొత్తం రివీల్..

ఉత్తర ప్రదేశ్ లో బీఎస్పీ అధికారంలో ఉన్న సమయంలో భూమిలేని నిరుపేదలకు భూమి పంపిణీ చేశామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం లో కూడా బీఎస్పీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూమి లేని నిరుపేదలకు భూమి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.

అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే బీఎస్పీ అధికారంలోకి రావాలన్నారు. 30న జరిగే తెలంగాణ ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై ఓటు వేసి బిఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని మరోసారి స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు