TS BJP First List: కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డికి ఫస్ట్ లిస్ట్ లో షాక్.. కారణమిదేనా?

కిషన్ రెడ్డి, లక్ష్మణ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి తదితర ప్రముఖుల పేర్లు లేకుండానే తెలంగాణ బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదలైంది. ఇందులో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పోటీకి ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం సాగుతోంది. మిగిలిన వారి పేర్లు సెకండ్ లిస్ట్ లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

TS BJP First List: కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డికి ఫస్ట్ లిస్ట్ లో షాక్.. కారణమిదేనా?
New Update

ఎట్టకేలకు తెలంగాణ ఎన్నికల బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ (Telangana BJP First List) విడుదలైంది. అయితే.. లిస్ట్ లో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ, బాబూ మోహన్ తదితర ముఖ్య నేతల పేర్లు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే.. ఈ నేతలు టికెట్ ఆశిస్తున్న సీట్లను ఫస్ట్ లిస్ట్ లో ఎవరికీ కేటాయించలేదు. దీంతో వీరి పేర్లు సెకండ్ లిస్ట్ లో ఉంటాయన్న ప్రచారం సాగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన మునుగోడు టికెట్ ను ఫస్ట్ లిస్ట్ లో ఎవరికీ కేటాయించలేదు. ఇంకా ఆయన ఆసక్తి చూపిస్తున్న ఎల్బీనగర్ టికెట్ కూడా లిస్ట్ లో లేదు. దీంతో కోమటిరెడ్డి ఎక్కడ పోటీ చేసే అంశం ఇంకా తేల్చుకోలేకపోవడంతోనే ఫస్ట్ లిస్ట్ లో ఆయన పేరు లేకపోవడానికి కారణమని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: BJP MLA Candidates: బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల.. కేసీఆర్ పై పోటీ చేసేది ఎవరంటే..

కోమటిరెడ్డి తో పాటు కిషన్ రెడ్డి, జితేందర్ రెడ్డి, డీకే అరుణ తదితరులు తమతో పాటు తమ కుటుంబ సభ్యులకు కూడా టికెట్లు అడుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ అంశంపై అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతోనే వీరి టికెట్ల ప్రకటనకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ తర్వాత బీజేపీ రెండో జాబితా విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాల నుంచి సమాచారం. ఆ లిస్ట్ లో ప్రస్తుతం టికెట్లు రాని ముఖ్యనేతల పేర్లు అన్నీ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే.. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం కూడా ఉంది. విజయశాంతి పేరు కూడా ఫస్ట్ లిస్ట్ లో లేదు. అయితే.. పోటీకి ఆమె ఆసక్తి చూపకపోవడంతోనే పేరు లేదని తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత లక్ష్మణ్ కూడా పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముషీరాబాద్ కు బండారు దత్తాత్రేయ కూతురు, కిషన్ రెడ్డి సతీమణి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. రెండో లిస్ట్ విడుదలైన తర్వాతనే ఈ అంశంపై క్లారిటీ రానుంది.

#bjp #telangana-elections-2023 #telangana-bjp
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe