Telangana Elections 2023: ఫేస్‌బుక్‌లో యాడ్ల కోసం కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నారు.. బీజేపీ, కాంగ్రెస్‌ ఖర్చుల లెక్క తెలిస్తే నోరెళ్లబెడతారు!

ఫేస్‌బుక్ యాడ్ లైబ్రరీ నివేదికలో కీలక విషయాలు బయటపడ్డాయి. తెలంగాణలో ప్రకటనల కోసం ఫేస్‌బుక్‌లో అత్యధికంగా ఖర్చు చేస్తున్న పార్టీ బీజేపీ అని నివేదిక చెబుతోంది. తెలంగాణలో గత 90 రోజుల్లో దాదాపు 1.5 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో గడిచిన 30 రోజుల్లో 73 లక్షలు ఖర్చు చేశారు.

మధ్యప్రదేశ్, ఛత్తీస్‎గఢ్‎లో ముగిసిన ప్రచారం..ఎల్లుండే ఎన్నికలు.. ప్రస్తుత పరిస్థితి ఇదే..!!
New Update

ఓటర్లపై సోషల్‌మీడియా ప్రభావం గట్టిగానే ఉంటుంది. ఇదే విషయం గత ఎన్నికల్లోనూ ప్రూవ్‌ అయ్యింది. పేజీలకు పేజీలు రాసుకోని ప్రత్యర్థులను విమర్శిస్తే జనాల్లో పోదు కానీ.. ఒక మీమ్‌ క్రియేట్ చేసి వదిలితే ఆ రీచ్‌ మాములుగా ఉండదు. దాని ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే రాజకీయ పార్టీలు సోషల్‌మీడియాపై చాలా కాలంగా, చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. రానున్న తెలంగాణ ఎన్నికలపైనా సోషల్‌మీడియా ప్రభావం గట్టిగానే ఉండనుంది. ఇది ఏదో ఎవరి నోటి నుంచో వచ్చిన గాలి మాట కాదు.. సాక్ష్యాత్తు ఫేస్‌బుక్‌ బయటపెడుతున్న నిజాలు. తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్న ప్రధాన పార్టీలు ఫేస్‌బుక్‌ అడ్వర్‌టైజ్‌మెంట్ల కోసం భారీగా ఖర్చు పెడుతున్నాయట.

లెక్కలు చూడండి బాసూ:
ఫేస్‌బుక్ యాడ్ లైబ్రరీ నివేదిక బయటకు వచ్చింది. ప్రకటనల కోసం ఫేస్‌బుక్‌లో అత్యధికంగా ఖర్చు చేస్తున్న పార్టీ ఏదో ఈ నివేదిక బయటపెట్టింది. తెలంగాణలో ఫేస్‌బుక్‌ యాడ్‌ల పరంగా మిగిలిన పార్టీల కంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్న పార్టీగా బీజేపీ నిలిచింది. ఇటు కాంగ్రెస్‌కి చెందిన పెద్ద లీడర్లు కూడా ఫేస్‌బుక్‌లో యాడ్‌ల కోసం భారీగా ఖర్చు చేసినట్టు నివేదిక చెబుతోంది. కాంగ్రెస్‌కి చెందిన ఎం. రఘునాథ్‌ యాదవ్‌, మర్రి ఆదిత్యరెడ్డి, జక్కిడి ప్రభాకర్‌ రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అత్యధికంగా ఖర్చుపెట్టారు. అటు దేశవ్యాప్తంగా లెక్కలు చూస్తే ఫిబ్రవరి 2019 నుంచి రాజకీయ నాయకులు, NGOలు దాదాపు 20 లక్షల యాడ్‌లు ఇచ్చారు. దీని కోసం 306 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తెలంగాణలో గత 90 రోజుల్లో దాదాపు 1.5 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో గడిచిన 30 రోజుల్లో 73 లక్షలు ఖర్చు చేశారు.

పేజీలపైనే భారీగా ఖర్చు:
రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోని ఫేస్‌బుక్‌లో వివిధ రకాల పేర్లతో పార్టీలే పేజీలను నడుపుతున్నాయన్న విషయం అందరికి తెలుసు. ఈ పేజీలో వేసే వార్తలకు రీచ్‌ అవసరం. 'సాలు దొర సెలవు దొర', 'మన మోదీ', 'బీజేపీ తెలంగాణ', 'తెలంగాణ ఆత్మ గౌరవం' లాంటి పేజీలతో బీజేపీ ప్రచారం చేస్తోంది. 'సాలు దొర సెలవు దొర' పేజీకి సంబంధించిన నంబర్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ ప్రజా ప్రజా సంగ్రామ యాత్ర ప్రచారానికి ఉపయోగించిన ఫోన్ నంబర్‌ ఒక్కటే..!

ALSO READ: తెలంగాణలో కాంగ్రెస్ చరిత్రను ఓడించగలదా? నెక్ట్స్ ఏం జరగబోతోంది?

#telangana-election-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe