TS Elections: కాంగ్రెస్‌పై ఈసీకి బీజేపీ కంప్లైంట్.. తెలంగాణ పత్రికల్లో కర్ణాటక స్టేట్ యాడ్స్‌పై ఫైర్!

తెలంగాణ పత్రికల్లో కర్ణాటక ప్రభుత్వ యాడ్స్‌పై బీజేపీ ఫైర్ అయ్యింది. ఇలా ఎలా యాడ్స్‌ ఇస్తారంటూ ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ కేంద్ర పెద్దలు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఇప్పటికే తెలంగాణ సీఈవోకు ఫిర్యాదు చేసినా యాక్షన్‌ తీసుకోలేదని కంప్లైంట్ లెటర్‌లో పేర్కొంది.

New Update
TS Elections: కాంగ్రెస్‌పై ఈసీకి బీజేపీ కంప్లైంట్.. తెలంగాణ పత్రికల్లో కర్ణాటక స్టేట్ యాడ్స్‌పై ఫైర్!

తెలంగాణ ఎన్నికల(Telangana elections) పోలింగ్‌ వేళ ఎన్నికల సంఘానికి పరస్పర ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఇప్పటికే రైతు బంధు విషయంలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌కు షాక్‌ ఇచ్చింది ఈసీ. ఇక తాజాగా ఎన్నికల కోడ్‌ను కాంగ్రెస్‌ ఉల్లంఘించిందంటూ కేంద్ర బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తెలంగాణ పత్రికల్లో కర్ణాటకకు చెందిన యాడ్స్‌ దర్శనమివ్వడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర బీజేపీ నేతలు భూపేందర్ యాదవ్, ప్రకాష్ జవదేకర్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

publive-image తెలంగాణ పత్రికల్లో కర్ణాటక యాడ్స్

ఇలా యాడ్స్‌ ఇవ్వకూడదని కంప్లైంట్:
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని కమిషన్‌కు రాసిన కంప్లైంట్‌ లెటర్‌లో ప్రస్తావించిన బీజేపీ.. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తన ప్రకటనలను తెలుగు భాషలో ప్రచురించడాన్ని లేవనెత్తింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డికె శివకుమార్ ఫొటోలతో యాడ్స్‌ను వేశారని ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం ద్వారా ఎప్పటికప్పుడు జారీ చేసిన చట్టాలు, నియమాలు, సూచనలకు కాంగ్రెస్‌ చేసిందని విరుద్ధమని చెప్పింది. కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం చేసింది చట్టవిరుద్ధమని, అనైతికమైనదని తెలిపింది. ఇది పార్టీ ప్రయోజనాలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వ వనరులు, ప్రజా నిధులను పూర్తిగా దుర్వినియోగం చేయడమేనని ఫిర్యాదు చేసింది.

publive-image తెలంగాణ తెలుగు న్యూస్ పేపర్లలో కర్ణాటక రాష్ట్రం యాడ్స్

చట్టాన్ని ఉల్లంఘించారు? :
RPA(రిప్రజెంటెషన్‌ ఆఫ్‌ పీపూల్ యాక్ట్)లోని సెక్షన్ 123లో ఉన్న చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించారని బీజేపీ తన కంప్లైంట్‌లో పేర్కొంది. ఇండియన్ పీనల్ కోడ్(IPC) సెక్షన్ 171C నిబంధనలను ఉల్లంఘించారని చెప్పింది. కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రాసిక్యూట్ చేయడానికి ఈసీ ఆదేశాలు జారీ చేయాలని కోరింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్నికలకు సంబంధించినవి ప్రచురించకుండా ఆదేశాలు జారి చేయాలని అభ్యర్థించింది.

బీజేపీ కంప్లైంట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొన్ని రోజులుగా తెలంగాణలోని ప్రధాన న్యూస్ పేపర్లలో కర్ణాటక కాంగ్రెస్‌ యాడ్స్ ఇస్తోంది. ఆరు గ్యారెంటీలను కర్ణాటకలో అమలు చేస్తున్నామని లబ్ధిదారుల మాటలతో సహా ప్రకటనలు ఇస్తోంది. కర్ణాటకలో ఆరు గ్యారెంటీలు అమలు కావడంలేదని ఓవైపు బీఆర్‌ఎస్‌ విమర్శలు గుప్పిస్తుంటే.. అందుకు బదులుగా నేరుగా సిద్ధరామయ్య ఫొటోలతో యాడ్స్‌ను ప్రింట్‌ చేయిస్తోంది. ప్రకటనల ఖర్చు తెలంగాణ కాంగ్రెస్‌ నేతల ఖాతాల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. కర్ణాటక ప్రభుత్వ డబ్బుతో తెలంగాణలో భారీ ప్రకటనలు ఇస్తుండడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

Also Read: హైదరాబాద్‎లో మోదీ రోడ్ షో: వేలాదిగా జనసందోహం

WATCH:

Advertisment
తాజా కథనాలు