BREAKING: బీఆర్ఎస్‌కు భారీ షాక్.. ఇద్దరు కీలక నేతలు ఔట్!

సూర్యాపేట జిల్లా కోదాడ బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌ తగిలింది. పలువురు కీలక నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే చందర్రావు బీఆర్‌ఎస్‌ రాజీనామా చేశారు. ఆయనతో పాటు ముగ్గురు MPPలు, ముగ్గురు ZPTC సభ్యులు, సీనియర్ నాయకులు ఎర్నేని వెంకట రత్నం బాబు, మాజీ డీసీసీబీ చైర్మన్ పాండురంగారావు, మహబూబ్ జానీ, ఎంపిటిసిలు, సర్పంచులు మూకుమ్మడి రాజీనామా చేశారు.

BREAKING: బీఆర్ఎస్‌కు భారీ షాక్.. ఇద్దరు కీలక నేతలు ఔట్!
New Update

ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌లు తగులుతున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. వేనేపల్లితో పాటు ముగ్గురు ఎంపీపీలు,ముగ్గురు జడ్పీటీసీలు కారు దిగారు. పలువురు ఎంపీటీసీలు, సర్పంచుల మూకుమ్మడిగా రాజీనామా చేశారు. బొల్లం మల్లయ్య యాదవ్‌ ఓటమే లక్ష్యంగా పని చేస్తామని శపథం చేశారు. రేపు ఉత్తమ్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో జాయిన్ అవుతామని ప్రకటించారు. ఎమ్మెల్యే నిరంకుశంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ నాయకులపైనే ఎమ్మెల్యే కేసులు పెట్టించడం దారుణమన్నారు. అదిష్టానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ గెలుపు కోసం అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు.

publive-image మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు (FILE)

నాలుగు సార్లు ఎమ్మెల్యే:

వేనేపల్లి చందర్‌రావు కోదాడ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. తెలుగుదేశం పార్టీతో వేనేపల్లి చందర్‌రావు పొలిటికల్‌ ఎంట్రీ మొదలైంది. 1985 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 1989, 1994 ఎన్నికల్లోనూ వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించాడు. చందర్‌రావు 2004లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమకుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. తిరిగి 2009లో నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీఆర్ఎస్‌(బీఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన కాంగ్రెస్‌ గూటికి చేరారన్న ప్రచారం జరుగుతోంది.

నిన్న షాద్‌నగర్‌లోనూ ఇంతే:

నిన్న షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే సైతం కాంగ్రెస్‌లో చేరారు. రాహుల్ గాంధీ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. చౌలపల్లి ప్రతాప్ రెడ్డి... 2009లో నాటి ఆంధ్రప్రదేశ్‌లోని షాద్‌నగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పుడు ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రతాప్‌రెడ్డి ఓడిపోయారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఆయన కాంగ్రెస్‌ను వీడారు. హస్తం గూటి నుంచి గులాబీ గూటికి చేరారు. ఇక రానున్న ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ దక్కలేదు. దీంతో తిరిగి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నట్టుగా తెలుస్తోంది. షాద్‌నగర్‌ రంగారెడ్డి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి . ఇది మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగం . 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు చెందిన అంజయ్య యాదవ్ విజయం సాధించారు.

Also Read: టీడీపీ సమావేశంలో కంటతడి పెట్టిన నారా లోకేశ్

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe