Telangana Elections 2023: నేడే తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల..

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మరో ముందడుగు వేయనుంది. ఇవాళ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేయనుంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు ఈ మేనిఫెస్టోని విడుదల చేయనున్నారు.

Telangana Elections 2023: నేడే తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల..
New Update

Telangana Congress Manifesto: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు మరింత పెంచింది. ఇప్పటికే 6 గ్యారెంటీ పథకాలను ప్రకటించిన ఆ పార్టీ.. ఇప్పుడు పూర్తిస్థాయి మేనిఫెస్టోని ప్రకటించనుంది. శుక్రవారం నాడు తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) తన మేనిఫెస్టోని రిలీజ్ చేయనుంది. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు.. ప్రజలను ఆకర్షిస్తాయని, ఇవి తమను అధికారంలోకి తీసుకువస్తాయని విశ్వసిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంయుక్తంగా ఈ మేనిఫెస్టోని విడుదల చేయనున్నారు.

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన..

ఇదిలాఉంటే.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. దీని ప్రకారం రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. శుక్రవారం తెలంగాణకు వస్తున్న ఆయన.. 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి 11.30 గంటలకు విజయవాడకు చేరుకుంటా రాహుల్. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 12.05 గంటలకు మణుగూరుకు చేరుకుంటారు. పినపాకలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. సభ అనంతరం నర్సంపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2-3 గంటల వరకు అక్కడ నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.25 గంటలకు హెలికాప్టర్‌లో వరంగల్ చేరుకుంటారు. 3.45 గంటల నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తారు. అనంతరం అక్కడ కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మీటింగ్ అయిపోయిన తరువాత సాయంత్రం 5:15 గంటలకు హెలికాప్టర్‌లో శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళతారు. అక్కడి నుంచి 6:10 గంటలకు విమానంలో జైపూర్‌కు చేరుక బయలుదేరుతారు.

Also Read:

సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం

యాక్సిస్ బ్యాంక్, మణప్పురం ఫైనాన్స్ కు ఆర్బీఐ షాక్!

#telangana-elections-2023 #congress-party #telangana-congress-manifesto
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe