Congress Manifesto: రైతులకు 2 లక్షలు.. అమ్మాయి పెళ్లికి లక్ష, తులం బంగారం.. కాంగ్రెస్ సంచలన మేనిఫెస్టో

తెలంగాణ కాంగ్రెస్ ప్రజాకర్షక మేనిఫెస్టోని విడుదల చేసింది. గెలుపే లక్ష్యంగా కళ్లు చెదిరే హామీలిచ్చింది. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, 3 లక్షల వడ్డీ లేని రుణాలు, స్టూడెంట్స్‌కి బైక్స్, ఎస్సీ, ఎస్టీలకు రూ.13 లక్షల సాయం, ఉద్యోగులకు ఓపీఎస్ అమలు వంటి పథకాలు ప్రకటించింది.

New Update
Congress Manifesto: రైతులకు 2 లక్షలు.. అమ్మాయి పెళ్లికి లక్ష, తులం బంగారం.. కాంగ్రెస్ సంచలన మేనిఫెస్టో

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు అనుబంధంగా.. అభయహస్తం పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది కాంగ్రెస్. 62 ప్రధాన అంశాలను ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌ రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు 10 ఏళ్లు అవకాశం ఇచ్చారని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ఆయన విఫలమయ్యారని అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ సృష్టించబోతోందన్నారు. మార్పు కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.

ఈ ఎన్నికలు దొరలు, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న సంగ్రామంగా పేర్కొన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఇది పీపుల్స్ మేనిఫెస్టో అని, తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు. మేనిఫెస్టోలో దళిత, గిరిజనులకు మేలు చేసే కార్యక్రమాలు ఉన్నాయన్నారు. ఈ మేనిఫెస్టో తెలంగాణ ప్రజలకు సంతోషం కలిగిస్తుందన్నారు భట్టి. బలహీనగ వర్గాలకు దామాషా ప్రకారం సంపదను పంచుతామని చెప్పారు భట్టి.

మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు..

👉 రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ
👉 వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్
👉 6 నెలల్లో టీచర్ ఉద్యోగాల భర్తీ
👉 రాష్ట్రంలో మరో 4 ట్రిపుల్ ఐటీల ఏర్పాటు
👉 ధరణి స్థానంలో భూమాత పోర్టల్
👉 అమరవీరుల కుటుంబాలకు రూ. 25 వేల పెన్షన్
👉 అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
👉 సీపీఎస్ రద్దు.. ఓపీఎస్ అమలు
👉 ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ. 12 వేలు
👉 రాష్ట్రంలో బెల్ట్ షాపులు రద్దు
👉 బీసీ కుల గణన.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు
👉 రూ. 3 లక్షల వడ్డీ లేని పంట రుణాలు
👉 ప్రధాన పంటలకు బీమా పథకం
👉 తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తాం
👉 తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం కేటాయింపు
👉 విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ సౌకర్యం
👉 మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ. 10 వేలకు పెంపు
👉 మూతపడ్డ 6వేల పాఠశాలలు పునరుద్ధరణ
👉 ఆరోగ్య శ్రీ పథకం రూ. 10 లక్షలకు పెంపు
👉 ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి భూసమస్యలు పరిష్కరిస్తాం
👉 అంగన్‌వాడీ టీచర్లకు నెలకు రూ. 18 వేల జీతం
👉 ఎల్బీనగర్, ఆరాంఘర్, మెహిదీపట్నం రూట్లలో మెట్రో విస్తరణ
👉 గ్రామ, వార్డు మెంబర్లకు నెలకు రూ. 1500 గౌరవ వేతనం
👉 ఆడ పిల్ల పెళ్లికి రూ. లక్ష, 10 గ్రాముల బంగారం
👉 రాష్ట్రంలో బీసీ సబ్‌ప్లాన్ అమలు చేస్తాం
👉 సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తాం
👉 బీడీ కార్మికులకు ఈఎస్ఐ, జీవిత బీమా వర్తింపచేస్తాం
👉 కొత్తగా మూడు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం
👉 సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రతిరోజూ ప్రజాదర్బార్
👉 వైట్ రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం
👉 దివ్యాంగులకు నెలకు రూ. 6 వేల పెన్షన్
👉 అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ
👉 ఏటా జూన్ 2 నాటికి ఖాళీల గుర్తింపు
👉 సెప్టెంబర్ 2వ తేదీ నాటికి ఉద్యోగాల భర్తీ
👉 యువతకు రూ. 10 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు
👉 ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంపు
👉 డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థినిలకు ఎలక్ట్రికల్ స్కూటర్ల పంపిణీ
👉 జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తాం
👉 ప్రతి జిల్లాలో బీసీ భవన్ ఏర్పాటు చేస్తాం
👉 ఈబీసీలకు ప్రత్యేక సంక్షేమ బోర్డు
👉 మైనార్టీ సబ్‌ ప్లాన్ తీసుకువస్తాం
👉 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 12 లక్షల ఆర్థిక సాయం
👉 స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
👉 జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతాం
👉 చనిపోయిన గీత కార్మికులకురూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా

Also Read:

మంత్రి సత్యవతి రాథోడ్ పై కేసు.. ఎన్నికల ప్రచారంలో మంత్రి ఏం చేశారంటే?

గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా?.. కాంగ్రెస్‌పై కవిత ఫైర్..

Advertisment
Advertisment
తాజా కథనాలు