50 ఏండ్ల తరువాత అక్కడ కాంగ్రెస్ విజయం.. శ్రేణులు కుష్!

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో 57 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరింది. 2023 ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి గెలుపొందారు.

50 ఏండ్ల తరువాత అక్కడ కాంగ్రెస్ విజయం.. శ్రేణులు కుష్!
New Update

TELANGANA ELECTION RESULTS: 57 సంవత్సరాల తర్వాత ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ 2023 సార్వత్రిక ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి విజయం సాధించారు. 1967 నుండి ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్టులు టిఆర్ఎస్ తప్ప ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించలేదు.

ALSO READ: కామారెడ్డిలో కేసీఆర్‌ ఘోర పరాజయం.. ! విజయం దిశగా కాంగ్రెస్..

1967 లో జరిగిన ఎన్నికల్లో కే ఎస్ రెడ్డి విజయం సాధించారు. అప్పటి నుంచి నేటివరకు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. 1967 నుంచి సీపీఎం, టీడీపీ, బీఆర్ ఎస్ పార్టీలు విజయం సాధించాయి.  దొంతి మాధవరెడ్డి 2014లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసారి ఎన్నికల్లో దొంతి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి సమీప బీఆర్ ఎస్ అభ్యర్థి పై విజయం సాధించారు. అంటే 1967 తర్వాత కాంగ్రెస్ పార్టీ గుర్తుపై పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యేగా 57 సంవత్సరాల తర్వాత చరిత్ర సృష్టించారు.

#telangana-elections-2023 #congress-won-in-telangana #telangana-election-results
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి