/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/KCR-1-jpg.webp)
TELANGANA ELECTION RESULTS: కేసీఆర్ కు ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది. కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి పాలయ్యారు. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకటరమణా రెడ్డి గెలుపొందారు. కేసీఆర్‌కు పోటీగా కామారెడ్డిలో పోటీ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో రెండు స్థానాలు.. గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పోటీ చేశారు. అయితే గజ్వేల్ లో కేసీఆర్ కు పోటీగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నిలబడ్డారు. అయితే.. కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోగా.. గజ్వేల్ లో కేసీఆర్ లీడింగ్ లో ఉన్నారు.
ALSO READ: విజయం దిశగా కాంగ్రెస్.. డీలా పడ్డ కారు
గజ్వేల్ పర్యటనలో సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల్లో గెలిచాక గజ్వేల్ లో ఉంటాను అని ప్రచారం చేయగా.. కామారెడ్డి ప్రజలు ఒకవేళ కేసీఆర్ గెలిస్తే తమ నియోజకవర్గానికి రారేమో అనుకోని ఓటు వేయకుండా ఉన్నారని టాక్ నడుస్తోంది.