TG: నిన్న పంపిణీ.. నేడు వెనక్కి.. వివాదంలో తెలంగాణ విద్యాశాఖ!

తెలంగాణ విద్యాశాఖ గత సీఎం, విద్యాశాఖ మంత్రి పేర్లతో కూడిన బుక్స్ పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. దీంతో ముందుమాట పేజీ చింపేసి ఇవ్వాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ కమిషనర్ ఆ తర్వాత పుస్తకాలను వెనక్కితీసుకోవాలని సూచించారు. దీనిపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

New Update
TG: నిన్న పంపిణీ.. నేడు వెనక్కి.. వివాదంలో తెలంగాణ విద్యాశాఖ!

Telangana Education Department: తెలంగాణ విద్యాశాఖ వివాదంలో చిక్కుకుంది. మాజీ సీఎంగా కేసీఆర్, విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి పేర్లతో ముద్రించబడిన పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయడం విమర్శలకు దారితీసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా తప్పుగా ప్రచురితమైన తెలుగు పాఠ్యపుస్తకాలను వెనక్కితీసుకోవాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే బుధవారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో పుస్తకాల పంపిణీ చేపట్టిన విద్యాశాఖ.. పంపిణీ చేసిన పుస్తకాలను వెనక్కి తీసుకుని మండల స్థాయి విద్యావనరుల కేంద్రాల్లో భద్రపరచాలని ఆదేశించింది. ఈ క్రమంలో స్కూల్ మొదలైన పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి రాకపోవడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు 1 నుంచి 10 తరగతుల తెలుగు వాచకం పాఠ్య పుస్తకాల్లోనూ ముందుమాట పేజీలో పొరపాటుగా విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి, అప్పటి అధికారుల పేర్లతో ముద్రించడంతో ఆ పేజీ చింపేసి విద్యార్థులకు ఇవ్వాలని విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ పేజీని తొలగించడంతో వెనుక వైపు ఉన్న వందేమాతరం, జాతీయ గీతం, సామూహిక ప్రతిజ్ఞ కూడా పుస్తకంలో లేకుండా పోయాయి. తెలుగు వాచకం పాఠ్యపుస్తకాల్లో వందేమాతరం, జాతీయ గీతం లేకుండా పిల్లలకు అందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు