Telangana: డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారులకు తెలంగాణ డీజీపీ రవి గుప్తా హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు కృషి చేస్తోందని తెలిపారు. డ్రగ్స్ వినియోగించినా, సరఫరా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఒక ట్వీట్(ఎక్స్) చేశారు.డ్రగ్స్ నిర్మూలనలో అందరం కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. పోలీసులతో కలిసి ప్రజలంతా ముందుకు రావాలని కోరారు. ఇక శాసనసభ ఎన్నికల సమయంలో ఈసీ ఆదేశాలతో డీజీపీ(హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్-హెచ్‌వోపీఎఫ్)గా తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన రవి గుప్తానే కొనసాగించేందుకు ప్రభుత్వం మొగ్గుచూపింది. ఆయన్ని డీజీపీ(సమన్వయం)గా నియమిస్తూ.. డీజీపీ(హెచ్‌వోపీఎఫ్)గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.
న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు..
హైదరాబాదీలకు బిగ్ షాక్ ఇచ్చారు పోలీసులు. నగరంలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31న రాత్రి ఒంటి గంట వరకే వేడుకలు నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు. అనుమంతించిన గడువు దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్‌లు, రెస్టారెంట్లు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. సెలబ్రేషన్స్‌కి 10 రోజులు ముందుగానే అనుమతి తీసుకోవాలన్నారు. ప్రతీ ఈవెంట్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిబంధన పెట్టారు. ఈవెంట్ల దగ్గర సెక్యూరిటీ, ట్రాఫిక్ నియంత్రించేందుకు గార్డులు తప్పనిసరిగా ఉండాలన్నారు. పబ్బుల్లో డ్యాన్సర్లతో కార్యక్రమాలు నిర్వహించడంపై నిషేధం విధించారు. కెపాసిటీకి మించి పాస్‌లు జారీ చేయవద్దన్నారు. డ్రగ్స్, గంజాయి రవాణపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు సీపీ శ్రీనివాస్ రెడ్డి. అంతేకాదు.. అనుమతి లేకుండా లిక్కర్ సరఫరా చేయొద్దన్నారు. డిసెంబర్ 31 రోజున డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఎవరైనా దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీపీ శ్రీనివాస్ రెడ్డి.
Also Read:
ప్రతీ ‘పథకం’ సంచలనమే.. ఏపీ ప్రజలకు చంద్రబాబు ఎన్నికల వరాలు..