TS Congress: తెలంగాణ కాంగ్రెస్ మరో సంచలన హామీ.. వారికి గౌరవ వేతనం? తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన మేనిఫెస్టో కమిటీ బుధవారం గాంధీభవన్ లో సమావేశమైంది. తాము అధికారంలోకి వస్తే వార్డు సభ్యులకు సైతం గౌరవ వేతనం ఇవ్వాలన్న ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. By Nikhil 26 Oct 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ ఎన్నికల్లో (TS Elections 2023) మరికొన్ని సంచలన హామీలను ఇవ్వడానికి తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) సిద్ధం అవుతోంది. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు గౌరవ వేతనం ఇవ్వాలని ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీకి ప్రతిపాదనలు అందినట్లు సమాచారం. బుధవారం గాంధీ భవన్ లో చైర్మన్ శ్రీధర్ బాబు అధ్యక్షతన టీపీసీసీ మ్యానిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీ సభ్యులకు గౌరవ వేతనం ఇవ్వాలని సభ్యులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సర్పంచ్ లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు మాత్రమే గౌరవ వేతనం అందిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే వార్డు సభ్యులకు సైతం గౌరవ వేతనం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో హామీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ స్టోరీ అప్డేట్ అవుతోంది.. #congress #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి