T-Congress First List: కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ లో 11 మంది బీసీలు.. లిస్ట్ ఇదే!

55 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో బీసీలకు 11 సీట్లను కేటాయించారు. రెడ్డి-17, వెలమ-7, బ్రాహ్మణులకు రెండు టికెట్లు దక్కాయి.

New Update
T-Congress First List: కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ లో 11 మంది బీసీలు.. లిస్ట్ ఇదే!

తెలంగాణ ఎన్నికలకు (Telangana Elections 2023) సంబంధించి 55 మందితో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ ను కొద్ది సేపటి క్రితం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ 55 మందిలో బీసీలకు 11 సీట్లు దక్కాయి. రెడ్డి-17, వెలమ-7, బ్రాహ్మణ-2 టికెట్లు కేటాయించారు. ఎస్సీ స్థానాలకు సంబంధించి 11 మంది, ఎస్టీ స్థానాలకు సంబంధించి 2 సీట్లను ప్రకటించారు. తమకు కనీసం 34 స్థానాలను కేటాయించాలని బీసీ లీడర్లు డిమాండ్ చేస్తున్న తరుణంలో వారికి ఎన్ని సీట్లను కేటాయిస్తారన్న అంశంపై ఇన్నాళ్లు ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఫస్ట్ లిస్ట్ లో కేవలం 11 స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించడంతో ఆ వర్గం నేతల్లో కాస్త నిరాశ వ్యక్తం అయినట్లు సమాచారం. సెకండ్ లిస్ట్ లో మరో 10-15 మంది బీసీ నేతలకు టికెట్లు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి:TS Congress: 55 మందితో కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల.. లిస్ట్ ఇదే.. ఆ ముఖ్య నేతలకు షాక్?

ఫస్ట్ లిస్ట్ లో బీసీలకు కేటాయించిన స్థానాల వివరాలు ఇలా ఉన్నాయి..

1. వేములవాడ.. ఆది శ్రీనివాస్

2.)మేడ్చల్.. తోటకూర వజ్రేష్ యాదవ్

3. సనత్ నగర్ ..కోట నీలిమ

4. గోషామహల్ : మొగిలి సునీత

5. చాంద్రాయణగట్ట : బోయ నగేష్

6. యాకుత్ పుర..రవి రాజు

7. బహదూర్ పుర.. రాజేష్ కుమార్ పులిపాటి

8. సికింద్రాబాద్.. ఆదం సంతోష్

9. గద్వాల ..సరిత

10. ఆలేరు.. బీర్ల ఐలయ్య

11. షాద్ నగర్.. శంకరయ్య

Advertisment
తాజా కథనాలు