కొత్త సీఎం ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ఇంకా పూర్తి కాలేదు. రాహుల్ గాంధీతో మల్లిఖార్జున్ ఖర్గే, వేణుగోపాల్ భేటీ అయ్యారు. పదవుల పంపకంపై నేతల మధ్య చర్చ సాగుతోన్నట్లు తెలుస్తోంది. సీఎంగా ఎవరు ఉండాలి? డిప్యూటీ సీఎంలు ఎవరు? అన్న విషయంపై డిస్కషన్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. డీకే శివకుమార్ తో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం సమావేశమై గంట పాటు మంతనాలు జరిపారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఇంటికి డీకే శివకుమార్ వెళ్లనున్నారు.
ఇది కూడా చదవండి: Telangana CM: సీఎం రేసులోకి దూసుకొచ్చిన దామోదర.. ఆయన ప్లస్ పాయింట్లు ఇవే!
ఖర్గే తో మీటింగ్ తర్వాతనే సీఎంపై ప్రకటన ఉండనుంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ సీఎం ఎంపికలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. డీకే శివకుమార్ నివాసానికి వైసీపీ ఎంపీ బాలశౌరి రావడం చర్చనీయాంశమైంది. డీకే ఇంటికి బాలశౌరి ఎందుకు వచ్చారు? ఆయన రాక వెనుక కారణాలేంటి? కొత్త సీఎం ఎంపికపై జగన్ హస్తం ఉందా? అన్న అంశాలపై చర్చ సాగుతోంది. బాలశౌరి రాక వెనక అంతర్యమేంటి? అన్న అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి.