రేపు వరంగల్ కు సీఎం రేవంత్

రేపు వరంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఓ హాస్పటల్ ను ప్రారంభించడంతో పాటు కాకతీయ మెగా జౌళి టెక్స్ టైల్ పార్క్ ను పరిశీలిస్తారు. అనంతరం.. వరంగల్ సమగ్రాభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Telangana: తెలంగాణ సీఎం రేవంత్ వరంగల్ టూర్ వాయిదా
New Update

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు వరంగల్‌ పర్యటనకు వెళ్లనున్నారు. వరంగల్‌ సమగ్రాభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్ట్‌, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ సిస్టం, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, మామునూరు ఎయిర్‌పోర్టు తదితర అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. వరంగల్‌ నగరాభివృద్ధికి ప్రణాళికలు రచించాలని ఇప్పటికే రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు డీపీఆర్ లు సిద్ధం చేశారు. ముందుగా పరకాల నియోజకవర్గం గీసుకొండ మండలం శాయంపేటలోని కాకతీయ మెగా జౌళి టెక్స్‌టైల్‌ పార్క్‌ ను ఆయన సందర్శిస్తారు. ఆ తర్వాత హన్మకొండలోని ఓ హాస్పిటల్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం నయీమ్‌నగర్‌లోని నాలా పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించే రివ్యూ మీటింగ్‌ లో పాల్గొంటారు.

ఇదిలా ఉంటే.. రేపు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి  పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా మంత్రులు, MLA లు మరియు కలెక్టర్ల తో సమావేశం నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కోసం సీఎం కు నివేదించనున్న పలు అంశాల పై సమావేశంలో చర్చించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, భూగర్భ డ్రైనేజీ, రింగ్ రోడ్డు, కాళోజీ కళాక్షేత్రం, మామునూరు ఎయిర్ పోర్ట్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, హనుమకొండ ఐడీఓసీ కార్యాలయంలో చేపట్టనున్న వనమహోత్సవం, మహిళాశక్తి కార్యక్రమం తదితర అంశాల పై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమాలోచనలు చేశారు.

సీఎం పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ ను పర్యవేక్షించడంతో పాటు ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని మంత్రి సురేఖ, సీతక్క అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, కలెక్టర్లు సత్య శారదా దేవి, ప్రావీణ్య గార్లు పాల్గొన్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe