Telangana: రేషన్‌కార్డు లేని వారికి శుభవార్త చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వ పథకాల కోసం రేషన్ కార్డు లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. దరఖాస్తు ఫారంలో తమకు రేషన్ కార్డు లేదని పేర్కొనాలని తెలిపారు సీఎం. By Shiva.K 27 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Govt Scheme: తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు శుభవార్త చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఓవైపు ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డే ప్రమాణికం అని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో సీఎం చేసిన ప్రకటన ప్రజలకు ఊరటనిస్తోంది. ఇంతకీ సీఎం ఏం ప్రకటర చేశారో తెలుసుకుందాం.. తెలంగాణలో గురువారం నుంచి ఆరు గ్యారెంటీ స్కీమ్‌లకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ఫారంను బుధవారం సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వ పథకాలు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అని ప్రకటించారు. అదే సమయంలో రేషన్ కార్డు లేని అర్హుల పరిస్థితి ఏంటని ప్రశ్నించగా.. అర్హులకు త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. రేషన్‌కార్డు లేని వాళ్లు.. కార్డు లేదని పేర్కొనవచ్చన్నారు. అర్హులైన వారికి రేషన్‌కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ తెలిపారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. ఈలోపు పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. రేషన్ కార్డు లేకున్నా పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. దరఖాస్తు ఫారంలో రేషన్ కార్డు లేదు అని పేర్కొనవచ్చని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కాగా, డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ సభల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ ఆరు గ్యారెంటీలకు రేషన్ కార్డు, ఆధార్ కార్డ్ తప్పనిసరిగా అవసరం. 6 గ్యారెంటీల అప్లికేషన్‌లో అన్ని వివరాలను రాయాల్సి ఉంటుంది. Also Read: వైసీపీ మరో బిగ్ షాక్.. ‘గుడ్ బై’ చెప్పిన ఎమ్మెల్యే..! ఆ ప్రచారంపై కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్.. #cm-revanth-reddy #telangana-ration-cards మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి