CM Revanth Reddy: సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్ట్ పై సీఎం సమీక్ష

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ లో సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్ట్ పై ఈ రోజు హరే రామ, హరే కృష్ణ ఫౌండేషన్ సభ్యులతో చర్చించారు. ఈ ప్రాజెక్ట్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు అధ్యయనం చేయాలన్నారు.

New Update
CM Revanth Reddy: సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్ట్ పై సీఎం సమీక్ష

హరే రామ, హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. కొడంగల్ లో సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్ట్ పై చర్చించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా నియోజకవర్గంలో ప్రతీరోజు 28వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించే ఏర్పాటు చేయనున్నారు. కొడంగల్ పట్టణంలో ఇప్పటికే సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ పనులను చేపట్టారు.

ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ను హరే రామ-హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్, సీఎస్ఆర్ ఫండ్స్ తో నిర్వహించనున్నారు. సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం పూర్తయిన వెంటనే కొడంగల్ లో పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులకు సీఎం సూచించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Telangana: అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్-వద్దన్న ఓవైసీ



Advertisment
తాజా కథనాలు