తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం.. సీఎం రేవంత్

కన్నతల్లిని తలపించేలా, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి ఉండాలన్నది తమ అభిమతమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 9న సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతున్నామని ప్రకటించారు. ఈ రోజు విగ్రహ ఏర్పాటుకు సీఎం భూమి పూజ చేశారు.

New Update
తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం.. సీఎం రేవంత్

సచివాలయ ప్రాంగణంలో ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దసరా వరకు మంచిరోజులు లేవని వేదపండితులు సూచించారన్నారు. అందుకే ఈరోజు హడావుడిగా కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వచ్చిందన్నారు. సోనియమ్మ మాట ఇస్తే అది శిలాశాసనమన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చారన్నారు. పదేళ్లు పరిపాలన చేసిన వారు తెలంగాణ తల్లిని తెరమరుగు చేశారన్నారు. నేనే తెలంగాణ.. తెలంగాణనే నేను అనేలా గత పాలకులు వ్యవహరించారని ధ్వజమెత్తారు. ప్రజా ప్రభుత్వం అలాంటి విధానాలకు వ్యతిరేకం. సచివాలయం తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు గుండెకాయలాంటిదన్నారు. గత పాలకులు పదేళ్లు సచివాలయంలోకి ప్రజలకు ప్రవేశం కల్పించలేదని ఫైర్ అయ్యారు.
ఇది కూడా చదవండి: TG: సంగం డెయిరీ దగ్గర ఉద్రిక్తత.. రైతుల ఆందోళన..!

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు వారికి మనసు రాలేదన్నారు. ట్యాంక్ బండ్ నలు వైపులా ఎంతో మంది ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ విగ్రహం లేకపోవడం ఒక లోటుగా కనిపించింది. మేధావుల సూచన మేరకే సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీన్ని వివాదం చేసేందుకే తెలంగాణ తల్లి విగ్రహంతో ముడి పెట్టారని బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. పదేళ్లు అధికారంలో ఉండి వాళ్లు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయలేదన్నారు. సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని తాము గతంలోనే ప్రకటించామని గుర్తు చేశారు.

కన్నతల్లిని తలపించేలా, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి ఉండాలన్నది మా అభిమతం. విగ్రహం రూపొందించే బాధ్యతను జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగానికి అప్పగించామన్నారు రేవంత్. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతున్నామని ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 ఒక పండుగ రోజన్నారు. వేలాది మందితో పెద్ద ఎత్తున విగ్రహావిష్కరణ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఇది అరుదైన అవకాశమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు