TS Pensions: తెలంగాణలో పింఛన్ లు రూ.4 వేలకు పెంపు.. ఎప్పటినుంచంటే?

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను రూ.4 వేలకు పెంచే దిశగా కసరత్తు చేస్తోంది రేవంత్ సర్కార్. 100 రోజుల్లోగా ఈ హామీ అమలు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఒకవేళ ఆలస్యమైతే ఉగాది కానుకగా పెంచిన పెన్షన్లను అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.

TS Pensions: తెలంగాణలో పింఛన్ లు రూ.4 వేలకు పెంపు.. ఎప్పటినుంచంటే?
New Update

Pension Scheme in Telangana: తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) హామీల అమలుపై దృష్టి సారించింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు (Free Bus) ప్రయాణంతో పాటు ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతామన్న హామీని నెరవేర్చింది రేవంత్ సర్కార్ (Revanth Government). అయితే.. ఆరు గ్యారెంటీల్లో అతి ముఖ్యమైన పెన్షన్ పెంపు హామీ అమలుపై ప్రభుత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. చేయూత స్కీమ్ కింద పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ప్రస్తుతం నెలకు రూ.2016 చొప్పున ఆసరా పింఛన్లను అందిస్తున్నారు. గత ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ ను రూ.4016కు పెంచింది.

ఇది కూడా చదవండి: Dharani Explainer: ధరణిలో ప్రధాన ప్రాబ్లెమ్స్ ఇవే.. సీఎం రేవంత్ చేసే మార్పులేంటి?

ఇంకా తెలంగాణలో మొత్తం పింఛన్ లబ్ధిదారుల సంఖ్య 43.68 లక్షలుగా ఉంది. లబ్ధిదారుల్లో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, గౌడ కార్మికులు, ఎయిడ్స్ రోగులు, డయాలసిస్‌, ఫైలేరియా బాధితులు, దివ్యాంగులు ఉన్నారు. ఈ అన్ని వర్గాల వారికి రూ.4 వేల పింఛను చెల్లిస్తే ఏటా రూ. 20,970 కోట్లు అవుతాయని అంచనా వేస్తోంది సర్కార్. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే (100 days) ఆయా హామీలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు చెప్పారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం అదే విషయాన్ని స్పష్టం చేశారు. అన్ని అనుకున్నట్లు జరిగితే రానున్న ఒకటి లేదా రెండు నెలల్లోపే నెలల్లోనే ఈ హామీల అమలును ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఒక వేళ ఆలస్యమైతే ఉగాది కానుకగా కొత్త పింఛన్లను అందించాలన్నది రేవంత్ సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది.

#asara-pension #cm-revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe