KCR Letter: ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ.. ఆ బిల్లులు ఆమోదించాలని విజ్ఞప్తి

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ రెండు లేఖలు రాశారు. పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కోరారు. చట్ట సభల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలని, మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

KCR Letter: ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ.. ఆ బిల్లులు ఆమోదించాలని విజ్ఞప్తి
New Update

KCR Letter: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ రెండు లేఖలు రాశారు. పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కోరారు. చట్ట సభల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలని, మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. బీసీ అభ్యున్నతి, మహిళా సంక్షేమానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందన్నారు. 2014లోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్‌కు తీర్మానం చేసినట్లు గుర్తు చేశారు. ఈ మేరకు బీసీ రిజర్వేషన్ బిల్లుపై తీర్మానం పాస్ చేసిన ప్రతిని కూడా ప్రధానికి రాసిన లేఖతో జతపరిచారు.

బీసీల పట్ల చిత్తశుద్ధి నిరూపించుకోవాలి..

ఈ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి బీసీల పట్ల బీజేపీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తెలియజేశారు. దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న బీసీలకు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వెల్లడించారు. అధికారంలో బీసీలను మరింత భాగస్వామ్యం చేయాల్సి ఉందన్నారు కేసీఆర్.  మహిళా సంక్షేమం, బీసీల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని.. దేశవ్యాప్తంగా వారి హక్కులను కాపాడేందుకు కేంద్రాన్ని ఎప్పటికప్పుడు తమ గళాన్ని వినిపిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం..

ప్రగ‌తి భ‌వ‌న్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం జరిగింది. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, కేంద్రం తెచ్చే బిల్లులు తదితర అంశాలపై పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహంపై చ‌ర్చించారు. ఈ దిశగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో పార్టీ డిమాండ్లను రాజ్యసభ, లోక్ సభల్లో ఎంపీలు లేవనెత్తాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

మహిళా బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం..

చట్ట సభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ కోసం బిల్లును ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మొట్ట మొదటి 2014 అసెంబ్లీ సమావేశాల్లోనే ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిన విషయాన్ని కేంద్రం ఇంతవరకు పట్టించుకోకపోవడంపై పార్లమెంటరీ సమావేశం అసంతృప్తిని వ్యక్తం చేసింది. మహిళాభ్యున్నతి పట్ల చిత్తశుద్దిని ప్రదర్శిస్తూ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సమావేశానికి పార్టీ పార్లమెంటరీ నేత కె. కేశవరావు, లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర్‌రావు సహా ఇతర ఎంపీలందరూ హాజరయ్యారు.

కాగా ఇండియా పేరు మార్పుతో పాటు జమిలీ ఎన్నికల బిల్లు సమావేశాల్లో పెడితే ఎలా వ్యవహరించాల్సిన దానిపై నేతలతో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి ఇటు ఎన్డీఏ కూటమితో పాటు అటు ఇండియా కూటమిలోనూ భాగస్వామ్యం లేని సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: విచారణకు హాజరు కావాల్సిందే-తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe