రోడ్డు మార్గాన బీఆర్‌ఎస్ నేతలతో మహారాష్ట్రకు సీఎం కేసీఆర్..!

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు సీఎం కేసీఆర్. బీఆర్​ఎస్​ను ఎప్పుడైతే స్థాపించారో ఆరోజు నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించారు. అక్కడి నుంచే దేశం మొత్తానికి విస్తరించడానికి సన్నాహాలు కూడా మొదలుపెట్టారు. నాగపూర్‌ నుంచే బీఆర్​ఎస్​ దేశ రాజకీయాల్లో ప్రవేశించాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ నేతలతో కాన్వాయ్‌లో రోడ్డు మార్గాన మహారాష్ట్ర చేరుకోనున్నారు సీఎం కేసీఆర్.

రోడ్డు మార్గాన బీఆర్‌ఎస్ నేతలతో మహారాష్ట్రకు సీఎం కేసీఆర్..!
New Update

telangana-cm-kcr-left-for-maharashtra-tour-with-a-huge-convoy-600-vehicles

హైదరాబాద్- ముంబై హైవే మీదుగా భారీ కాన్వాయ్‌తో వెళ్లనున్నారు. కాన్వాయ్‌లో రెండు బస్సులు, సుమారు 600 వాహనాలు ఉన్నాయి. కేసీఆర్‌ బస్సులో ముందు సీటులో కూర్చున్నారు. కాన్వాయ్ సంగారెడ్డి మీదుగా బయల్దేరి రోడ్డు మార్గాన మహారాష్ట్ర చేరుకోనుంది. రెండు రోజుల పాటు సోలాపుర్‌, దారాశివ్‌ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. కేసీఆర్‌ వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఉన్నారు. పర్యటనకు బయల్దేరే ముందు హోం మంత్రి మహమూద్ అలీ కేసీఆర్ రక్షా కవచం కట్టారు.

సీఎం పర్యటనలో భాగంగా సంగారెడ్డి పోలీసులు అలర్ట్ అయ్యారు. హైవేపై 200 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర పర్యటనకు వెళ్లే సమయంలో సంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల సీఎం ఆగే అవకాశముంది. దీంతో ఎక్కడిక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా పలువురు మహారాష్ట్ర నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఇవాళ సాయంత్రానికి మహారాష్ట్రలోని షోలాపూర్‌కు కేసీఆర్ చేరుకుంటారు.

మంగళవారం (ఈనెల 27న) ఉదయం సోలాపూర్‌ జిల్లాలో పండరిపూర్‌కు చేరుకొని అక్కడి విఠోభారుక్మిణి మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సోలాపూర్‌ జిల్లా ప్రముఖ నాయకుడు భగీరథ్‌ బాల్కే సహా పలువురు నేతలు సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌ తిరిగి ప్రయాణం కానున్నారు. హైదరాబాద్‌ వస్తున్న క్రమంలో దారాశివ్‌ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హైదరాబాద్‌కు అదే రోడ్డు మార్గాన చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe