
తెలంగాణ సీఎం కేసీఆర్(KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (VRA) వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్టు డిసిషన్ తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని విద్యార్హతల ఆధారంగా ఇతర శాఖల్లో క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. VRA వ్యవస్థను రద్దు చేస్తూ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కాలానుగుణంగా కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఈ క్రమంలోనే వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నాం. గ్రామాల్లో వ్యవసాయ అభివృద్ధికి నీటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించడం, గ్రామ రెవెన్యూ, ఇతర విభాగాల అవసరాల కోసం తొలినాళ్లలో వీఆర్ఏ వ్యవస్థ ఏర్పాటైంది. నేడు మారిన పరిస్థితుల్లో వీఆర్ఏ వృత్తికి ప్రాధాన్యత తగ్గింది. అందుకే వారిని రెవెన్యూ శాఖలో క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటున్నామని’ కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు.