శాశ్వతంగా వీఆర్ఏ వ్యవస్థ రద్దు..వారంతా ఇతర శాఖలో క్రమబద్ధీకరణ..!

రాష్ట్రవ్యాప్తంగా వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్‌న్యూమరీ పోస్టుల్లో రెగ్యులరైజ్ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

New Update
శాశ్వతంగా వీఆర్ఏ వ్యవస్థ రద్దు..వారంతా ఇతర శాఖలో క్రమబద్ధీకరణ..!

kcr to abolish vra system కేసీఆర్ (ఫైల్)

తెలంగాణ సీఎం కేసీఆర్‌(KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్‌ (VRA) వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్టు డిసిషన్‌ తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని విద్యార్హతల ఆధారంగా ఇతర శాఖల్లో క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. VRA వ్యవస్థను రద్దు చేస్తూ కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కాలానుగుణంగా కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఈ క్రమంలోనే వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నాం. గ్రామాల్లో వ్యవసాయ అభివృద్ధికి నీటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించడం, గ్రామ రెవెన్యూ, ఇతర విభాగాల అవసరాల కోసం తొలినాళ్లలో వీఆర్‌ఏ వ్యవస్థ ఏర్పాటైంది. నేడు మారిన పరిస్థితుల్లో వీఆర్‌ఏ వృత్తికి ప్రాధాన్యత తగ్గింది. అందుకే వారిని రెవెన్యూ శాఖలో క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటున్నామని’ కేసీఆర్‌ వ్యాఖ్యలు చేశారు.

సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన ఈ కామెంట్స్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలోని సూపర్‌న్యూమరీ పోస్టుల్లో రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. వీఆర్‌ఏల విద్యార్హతల ఆధారంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మిషన్ భగీరథ , ఇరిగేషన్ విభాగాల్లో సర్దుబాటు చేస్తారు . వారిని పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగులుగా చేర్చుకుంటున్నట్లు ఇవాళ(జులై 24) ఉత్తర్వులు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. 61 ఏళ్లు దాటిన వీఆర్ఏల ఉద్యోగాలను వారి వారసులకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి గ్రామంలో మంచినీటి వ్యవస్థను కాపాడేందుకు, గ్రామ రెవెన్యూ తదితర అంశాలకు సంబంధించి ఏర్పాటైన గ్రామ సహాయకుల వ్యవస్థ నేటి వీఆర్ఏలుగా రూపాంతరం చెందిందని సీఎం అన్నారు. తరతరాలుగా సామాజిక సేవ చేస్తున్న వీఆర్ఏల ఆత్మబలిదానాల సేవను కేసీఆర్ కొనియాడారు. అయితే మారిన పరిస్థితుల్లో వీఆర్ఏ కెరీర్‌కు ప్రాధాన్యత తగ్గిందని గుర్తు చేశారు.

ఎలా సర్ధుబాటు చేస్తారు?

వీఆర్ఏల సర్దుబాటు, క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా నీటిపారుదల శాఖ, మిషన్ భగీరథకు మరింత మందిని మళ్లించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 23,046 వీఆర్‌ఏ పోస్టులు ఉండగా ప్రస్తుతం 21,433 మంది విధులు నిర్వహిస్తున్నారు. క్రమబద్ధీకరణ తర్వాత పే స్కేల్ కింద చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయిస్తుంది. వీఆర్ఏల్లో పీజీ, డిగ్రీ తదితర ఉన్నత విద్యలు పూర్తిచేసిన వారు సుమారు 5 వేల మంది ఉన్నారు. నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ల కింద 1,034 మంది, లష్కర్ల కింద 4,374 మంది, మిషన్ భగీరథ కింద 3 వేల మందిని నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. మున్సిపల్, పంచాయత్ రాజ్ శాఖల్లో మిగిలిన కొందరిని తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weight Lose: ఇలా చేశారంటే వేసవిలో సులభంగా బరువు తగ్గొచ్చు

బరువు తగ్గడానికి వేసవి కాలం ఉత్తమం. ఈ సీజన్‌లో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఎక్కువగా చెమట పడుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఈ సీజన్‌లో దోసకాయ, గెర్కిన్, బ్రోకలీ, టమోటా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఐస్ టీ తాగడం వల్ల బరువు తొందరగా తగ్గవచ్చు. 

New Update

Weight Lose: సరైన ఆహారం తీసుకుంటే వేసవిలో బరువు తగ్గడం శీతాకాలంలో కంటే సులభం అవుతుంది. ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే సలాడ్లు, ఆరోగ్యకరమైన డ్రింక్స్‌ చేర్చుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. శీతాకాలంలో బరువు తరచుగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి మనం అధిక కేలరీల ఆహారాన్ని తీసుకుంటాం. అయితే బరువు తగ్గడానికి వేసవి కాలం ఉత్తమం. ఈ సీజన్‌లో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఎక్కువగా చెమట పడుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

కాలేయం ఆరోగ్యంగా..

వేసవిలో పుచ్చకాయ సులభంగా దొరుకుతుంది. బరువు తగ్గడానికి ఇది ఒక గొప్ప పండు. ఇందులో పుష్కలంగా నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ సి, లైకోపీన్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. పుచ్చకాయ తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి సలాడ్ ఒక సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారం. ఈ సీజన్‌లో దోసకాయ, గెర్కిన్, బ్రోకలీ, టమోటా వంటి తక్కువ కేలరీల ఆహారాలు సులభంగా లభిస్తాయి. వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇది కూడా చదవండి: శరీరంలోని అధిక నీటిశాతం తగ్గించే చిట్కాలు

కడుపు చాలా సేపు నిండినట్లు అనిపిస్తుంది.  సలాడ్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఐస్ టీ వేడి నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో కూడా సహాయపడుతుంది. దీన్ని పుదీనా, నిమ్మకాయ, బెర్రీలతో కలిపి తాగవచ్చు. ఈ పానీయం జీవక్రియను వేగవంతం చేస్తుంది. కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. రోజూ ఒక గ్లాసు ఐస్ టీ తాగడం వల్ల బరువు తొందరగా తగ్గవచ్చంటున్నారు నిపుణులు. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి కొబ్బరి నీళ్లు ఒక గొప్ప ఎంపిక. ఇది శరీరాన్ని తాజాగా, చల్లగా ఉంచే ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటుంది. కొబ్బరి నీరు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా జీవక్రియను కూడా పెంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: భోజనం చేసేప్పుడు నీళ్లు తాగకూడదని ఎందుకు చెబుతారు?

(weight-lose | weight-lose-exercises | vegetable-juices-for-weight-lose | latest-news | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips)

 

Advertisment
Advertisment
Advertisment