TS Cabinet Meeting: ఎల్లుండే తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీతో పాటు చర్చించే అంశాలివే! ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా నిధుల సేకరణపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇంకా తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం పై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. By Nikhil 19 Jun 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రుణమాఫీపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. దీంతో ఆ హామీని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మంత్రివర్గ సమావేశంలో రుణమాఫీ, ఇందుకోసం నిధులు ఎలా సేకరించాలనే అంశంపై ప్రభుత్వం ప్రధానంగా చర్చించనుంది. రుణమాఫీకి రూ.30 వేల కోట్లు అవసరం ఉందని ప్రభుత్వం అంచనాకు వచ్చినట్లు సమాచారం. దీంతో పాటు రైతు భరోసాపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పథకం అమలుకు రూ.7 వేల కోట్ల బడ్జెట్ అవసరం ఉంటుంది. గత ప్రభుత్వం రైతుబంధు మాదిరిగా కాకుండా.. రైతు భరోసాకు కటాఫ్ పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం సాగు భూములకు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం మొదటి నుంచి చెబుతోంది. వందల కొద్దీ ఎకరాలు ఉన్న వారికి, ట్యాక్స్ కట్టే వారికి ఇవ్వమని అనేక సార్లు మంత్రులు స్వయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి జరగబోయే కేబినెట్ భేటీలో ఈ అంశాలపై చర్చించి విధివిధానాలు రూపొందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇంకా పంటల బీమాపై సైతం ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పన తదితర అంశాల కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా రాష్ట్ర కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపై కూడా చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి