బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మహిళలకు శుభవార్త చెప్పారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఉమ్మడి ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చిన్నతరహా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ స్కీమ్ ద్వారా ద్వారా ప్రతీ సంవత్సరం 5,000 గ్రామీణ సంఘాలకు, ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు ప్రయోజనం చేకూరేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రానున్న ఐదేళ్లలో 25,000 సంస్థలకు విస్తరించేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో 63 లక్షల మహిళలను విజయవంతమైన వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు భట్టి విక్రమార్క.
Telangana Budget 2024: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. బడ్జెట్ లో కీలక ప్రకటనలు!
ఈ రోజు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మహిళలకు అనేక శుభవార్తలు చెప్పారు. మహిళలను పారిశ్రామికవేత్తలు తీర్చిదిద్దుతామన్నారు. రానున్న ఐదేళ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు.
Translate this News: