/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/G-Kishan-Reddy-jpg.webp)
Kishan Reddy Bike Rally: దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడూ చేయలేని సాహసాన్ని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి(Kishan Reddy) చేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో చైతన్యం నింపేందుకు.. స్వయంగా తానే 200 కిలోమీటర్లపాటు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. 7 గంటలపాటు జరిగిన ఈ ర్యాలీ సందర్భంగా కేంద్రమంత్రికి అడుగడుగునా జనం నీరాజనం పలికారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ నుంచి కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఉదయం ర్యాలీ ప్రారంభమైంది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇంచార్జ్ ప్రకాశ్ జవడేకర్ గారు జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు.
సికింద్రాబాద్‌లో ప్రారంభమైన ఈ ర్యాలీకి బీజేపీ కార్యకర్తలు, యువత తమ వాహనాలతో ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపారు. అడుగడుగునా మహిళలు, కార్యకర్తలు.. కిషన్ రెడ్డికి స్వాగతం పలికారు. హరతి పట్టి వీరతిలకం దిద్దారు. త్రివర్ణ పతాకాలు, బీజేపీ జెండాలతో ఈ ర్యాలీ పొడగునా రోడ్లన్నీ రంగులమయంగా మారాయి. బైక్ యాత్ర హబ్సిగూడ, ఉప్పల్, ఘట్ కేసర్, భువనగిరి, ఆలేరు మీదుగా జనగాంలో మధ్యాహ్న భోజనం కోసం ఆగింది. భువనగిరిలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి సీనియర్ నాయకుడు ఈశ్వర్ గుప్తాకు కిషన్ రెడ్డి పాదాభివందనం చేశారు.
అమరవీరుల స్మరణలో, ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా జరుగుతున్న హైదరాబాద్ విమోచన వేడుకల్లో ప్రజలను భాగస్వామ్యం చేసే క్రమంలో..
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దగ్గర మొదలై, ఘట్కేసర్, భువనగిరి, జనగాం, హనుమకొండ వరంగల్, ములుగు క్రాస్ రోడ్ మీదుగా పరకాలలోలని అమరధామం వరకు బైక్ యాత్ర ఇవాళ… pic.twitter.com/b90G4Kx5SR
— G Kishan Reddy (@kishanreddybjp) September 15, 2023
వరంగల్, ములుగు క్రాస్ రోడ్ మీదుగా పరకాలలోలని అమరధామం వరకు ఈ యాత్ర కొనసాగింది. నిజాం ఉక్కుపిడికిలిలో నలిగిన హైదరాబాద్ సంస్థాన్ విముక్తి గాథ భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ముఖ్యమైన ఘట్టమని దీన్ని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. విమోచన దినోత్సవాన్ని సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలనడం ద్వారా విముక్తి పోరాట వాస్తవ చరిత్రను మరుగున పడేయాలనే కేసీఆర్ ప్రయత్నాన్ని తిప్పికొట్టి.. వాస్తవ చరిత్రను ప్రజలకు చాటిచెబుతామని కిషన్ రెడ్డి అన్నారు.
Congress conspired to hide the history of #HyderabadLiberationDay to appease their partner and long term friend MIM.
Congress has no right to conduct a public meeting on 17th September, unless they apologise to the people of Telangana and their President kneeling infront of… pic.twitter.com/aBzroE8vRw
— G Kishan Reddy (@kishanreddybjp) September 15, 2023
స్వాతంత్రకాంక్షతో రజాకార్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు వదిలిన పరకాల అమరవీరులకు నా జోహార్లు !
నిజాం అరాచకంలో నలిగిన హైదరాబాద్ సంస్థానం విముక్తి గాథ భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ముఖ్యమైన ఘట్టం. జలియన్ వాలాబాగ్ ను తలపించే విధంగా రజాకార్ల మారణహోమానికి బలైన ప్రాంతం… pic.twitter.com/7YhNWWNoJp
— G Kishan Reddy (@kishanreddybjp) September 15, 2023
Also Read:
బీఆర్‌ఎస్‌కు షాక్! మరోసారి జంప్ అయిన మాజీ ఎమ్మెల్యే.. ఈసారి వారు కూడా..
Telangana: విశ్వకర్మ యోజనతో రూ. 3 లక్షల రుణం.. కీలక వివరాలు వెల్లడించిన ఎంపీ లక్ష్మణ్..