Vijayashanti: బీజేపీలో రాములమ్మ బాంబ్‌.. కమలంలో టెన్షన్ టెన్షన్..!

నటి, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీని వీడుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మొన్న సోనియాగాంధీని ప్రశంసిస్తూ ట్వీట్‌ పెట్టిన రాములమ్మ మరో సంచలన ట్వీట్ చేశారు. జాతీయ పార్టీని తెలంగాణ జనం పక్కన పెట్టేశారన్నారు. ఇటివలీ బీజేపీ పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారని ఇంటర్నెల్ టాక్‌. అటు బీజేపీ కూడా కీలక సమావేశాలకు విజయశాంతిని పిలవడంలేదు.

New Update
Vijayashanti: బీజేపీలో రాములమ్మ బాంబ్‌.. కమలంలో టెన్షన్ టెన్షన్..!

Vijayashanti to change party? : అసలే ఫామ్‌లో లేక తంటాలు పడుతున్న టీమ్‌లో కీలక ప్లేయర్లు గాయాలుపాలైతే ఎలా ఉంటుందో తెలుసా? గాయం కూడా కాదు.. అసలు టీమ్‌లోనే ఆడనని చెబితే ఆ జట్టు కోచ్‌, కెప్టెన్‌ బాధ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. ప్రస్తుతం బీజేపీ పరిస్థితి చూస్తే అలానే అనిపిస్తోంది. అయ్యో పాపం అని జాలి పడే దుస్థితి వాళ్లది.. ఎన్నికలు దగ్గర పడుతున్నా ఇప్పటివరకు సీనియర్లలో ఐక్యత లేకపోవడం.. జట్టుగా, కలిసికట్టుగా ముందుకు వెళ్లకపోవడం తెలంగాణ బీజేపీలకు మైనస్‌గా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతుండగా.. ఇదే సమయంలో కమల పార్టీ కీలక మహిళా నేత, నటి, మాజీ ఎంపీ విజయశాంతి బాంబులు పేల్చుతున్నారు. విజయశాంతి వరుసపెట్టి వేస్తున్న ట్వీట్లు కాషాయ దళంలో గుబులు రేపుతున్నాయి.

బీజేపీలో ప్రతిఘటన :
రాములమ్మ బీజేపీని భయపెడుతోంది. ట్విట్టర్‌లో విజయశాంతి పోస్టులు తూటాల్లా పేలుతున్నాయి. మొన్న సోనియాను అభిమానిస్తామని ట్వీట్ చేసిన విజయశాంతి తాజాగా బీజేపీ పోటీలోనే లేదంటూ బాంబ్ పేల్చారు. జాతీయ పార్టీని తెలంగాణ జనం పక్కన పెట్టేశారని ట్వీట్ చేశారు. విజయశాంతి తీరుతో కమలనాథుల్లో కలవరం మొదలైంది. వచ్చే ఎన్నికలను స్వతంత్ర పోరాటంగా అభివర్ణించిన రాములమ్మ.. కొంత కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. అటు బీజేపీ కోర్‌ మీటింగ్‌లకు సైతం విజయశాంతి హజరుకావడం లేదు. ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతుండగా.. విజయశాంతి నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


మళ్లీ కాంగ్రెస్‌ గూటికి:
నిజానికి 1998లో విజయశాంతి భారతీయ జనతా పార్టీలో చేరారు. జనవరి 2009లో తన సొంత రాజకీయ పార్టీ అయిన తల్లి తెలంగాణను ప్రారంభించారు, బలం, మద్దతు లేకపోవడంతో ఆమె తన పార్టీని భారత రాష్ట్ర సమితి (BRS)లో విలీనం చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో విభేదించిన విజయశాంతి ఫిబ్రవరి 2014లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక నవంబర్ 2020లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి డిసెంబర్ 2020లో హోం మంత్రి అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో తిరిగి చేరారు . ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ గూటికే రాములమ్మ చేరుతారన్న ప్రచారం జరుగుతోంది.

ALSO READ: కాంగ్రెస్‌లోకి రాములమ్మ..? లేడి అమితాబ్‌ ట్వీట్ వెనుక ఆంతర్యం అదేనా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు