TBJP: 119 స్థానాలు.. 6వేల దరఖాస్తులు.. బీజేపీ టికెట్ కోసం పోటెత్తారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీలు దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానించాయి. దీంతో బీజేపీ తరపున పోటీ కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. రికార్డు స్థాయిలో 6వేల మంది టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవడం విశేషం. సెప్టెంబర్ 4 నుంచి దరఖాస్తులను స్వీకరించగా.. 10వ తేదీతో గడువు ముగిసింది. టికెట్ కోసం ఆశావహులు భారీగా పోటెత్తారు. By BalaMurali Krishna 11 Sep 2023 in Latest News In Telugu హైదరాబాద్ New Update షేర్ చేయండి TBJP: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీలు దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానించాయి. దీంతో బీజేపీ తరపున పోటీ కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. రికార్డు స్థాయిలో 6వేల మంది టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవడం విశేషం. సెప్టెంబర్ 4 నుంచి దరఖాస్తులను స్వీకరించగా.. 10వ తేదీతో గడువు ముగిసింది. టికెట్ కోసం ఆశావహులు భారీగా పోటెత్తారు. 119 స్థానాలు.. 6వేల దరఖాస్తులు.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 6వేల మందికి పైగా అప్లై చేసుకోవడం చూస్తుంటే పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరి రోజు 2,781 దరఖాస్తులు రావడం గమనార్హం. అయితే ఒక్కో అభ్యర్థి మూడు, నాలుగు స్థానాలకు దరఖాస్తు చేసుకున్నారు. తొలి ప్రయత్నంలోనే తమకు అవకాశం దొరక్కపోతే మరో విడతో అవకాశం దక్కుతుందనే భావనలో ఇలా చేసినట్లు చెబుతున్నారు. సెప్టెంబర్ 4న 182 దరఖాస్తులు రాగా.. సెప్టెంబర్ 5వ తేదీన 178 దరఖాస్తులు.. 6వ తేదీన 306 దరఖాస్తులు.. 7వ తేదీన 333 దరఖాస్తులు వచ్చాయి. ఇక 8వ తేదీన 621 దరఖాస్తులు.. 9వ తేదీన 1603 దరఖాస్తులు.. సెప్టెంబర్ 10న 2781 దరఖాస్తులు వచ్చాయి. ఏడు రోజుల్లో మొత్తం 6003 మంది అసెంబ్లీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. గజ్వేల్ నుంచి ఈటల తరపున దరఖాస్తులు.. ఇప్పటికే శనివారం ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, గజ్జల యోగానంద్, మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆకుల విజయ, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి, కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షుడు బేజాది బీరప్ప, యెడ్ల సతీష్ కుమార్ టికెట్ కోసం తదితరులు దరఖాస్తులిచ్చారు. ముషీరాబాద్ అసెంబ్లీ స్థానానికి బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయ లక్ష్మి దరఖాస్తు చేసుకున్నారు. రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఇదే స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ముషీరాబాద్ అసెంబ్లీ స్థానానికి గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ దరఖాస్తు పెట్టుకున్నారు. స్థానిక కార్పొరేటర్లు సైతం ముషీరాబాద్ స్థానానికి పోటీపడుతున్నారు. అయితే గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి ఈటల రాజేందర్‌ను ఎంపిక చేయాలని కోరుతూ గజ్వేల్ నేతలు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. మూడు దశల్లో అభ్యర్థుల ఎంపిక.. మరోవైపు ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లకు సినీ నటి జీవిత రాజశేఖర్ దరఖాస్తు చేసుకున్నారు. జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, సికింద్రాబాద్ స్థానాలకు అప్లై చేశారు. మరో నటి కరాటే కల్యాణి కూడా నాలుగు, ఐదు స్థానాలకు దరఖాస్తు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా బీజేపీ దరఖాస్తుల ప్రక్రియ చేపట్టింది. అభ్యర్థుల జాబితాపై మూడు దశల్లో ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తుల పరిశీలనకు ఒక కమిటీ ఏర్పాటు చేసి.. జిల్లా, రాష్ట్ర, కేంద్ర పార్టీ స్థాయిలో స్క్రీనింగ్ చేపట్టనున్నారు. రాష్ట్ర నేతల పరిశీలన తర్వాత జాతీయ కమిటీకి జాబితా చేరనుంది. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తోంది.. ఇంద్రసేనారెడ్డి ఘాటు వ్యాఖ్యలు #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి