TS News: రేపటి నుంచి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే నిరాహార దీక్ష.. ఎందుకో తెలుసా?

అందెవెల్లి పెద్దవాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందని సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు ఆరోపించారు. రేపు ఉదయం 9 గంటలలోగా అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోతే అదే బ్రిడ్జిపై నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు.

TS News: రేపటి నుంచి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే నిరాహార దీక్ష.. ఎందుకో తెలుసా?
New Update

సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం 9 గంటల నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగనున్నట్లు ప్రకటించారు. అందవెల్లి పెద్దవాగు బ్రిడ్జి పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. రేపు ఉదయం 9 గంటలలోగా అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోతే నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఈ బ్రిడ్జి మీదనే నిరాహార దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ కు సకాలంలో బిల్లు చెల్లించకపోవడంలో ఈ సమస్య ఉత్పన్నమైందన్నారు.

యుద్ధ ప్రాతిపదికన ఈ అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసి విడుదల చేశారు. రేపు ఉదయం 9 గం.లోగా ఈ అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోతే నిరవధిక నిరాహార దీక్షకు ఈ బ్రిడ్జి మీదనే కూర్చుంటానని హెచ్చరించారు. గత నెల రోజులుగా ఇన్చార్జి మంత్రి సీతక్కకు ఈ బ్రిడ్జి గురించి అనేక మార్లు తెలియజేశానన్నారు. అయినా ఈ సమస్యను పరిష్కరించడంలో వారు విఫలమయ్యారని విమర్శించారు. సోమవారం తాను చేపట్టబోయే నిరవధిక నిరాహార దీక్షకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని హరీష్ బాబు పిలుపునిచ్చారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe