కేసీఆర్‌ పాలనలో అవినీతి రాష్ట్రంగా తెలంగాణ: కిషన్ రెడ్డి

హైదరాబాద్ నగరం గులాబీ పార్టీ ఏటీయంగా మారిపోయిందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ కంపెనీగా కేసీఆర్ మార్చేశారని.. భూమి కనిపిస్తే కబ్జా చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

New Update
కేసీఆర్‌ పాలనలో అవినీతి రాష్ట్రంగా తెలంగాణ: కిషన్ రెడ్డి

తెలంగాణ తెచ్చుకుంది కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా ఉండటం కోసం కాదన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగిన బీజేపీ బహిరంసభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ ప్రజలను బానిసలుగా చూస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలలో బీఆర్‌ఎస్‌కు ఇప్పుడున్న ఎంపీ స్థానాలు కూడా రావని.. ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు రెడీగా ఉన్నారని జోస్యం చెప్పారు. 9 సంవత్సరాల కేసీఆర్ పాలనలో దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా తెలంగాణ మారిందని విమర్శించారు.

రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ కంపెనీగా కేసీఆర్ మార్చేశారని.. భూమి కనిపిస్తే కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. విద్య వైద్యాన్ని గాలికొదిలేసి కేసీఆర్ మద్యాన్ని మాత్రం ఏరులై పారిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎవరైనా ఏదైనా వ్యాపారం చేయాలంటే మాత్రం బీఆర్ఎస్ నాయకులకు వాట ఇవ్వాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు. హైదరాబాద్ నగరం గులాబీ పార్టీ ఏటీయంగా మారిపోయిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి ముగింపు పలకాలని బీజేపీని ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నానని కిషన్ రెడ్డి వెల్లడించారు.

గతంలో సోనియా గాంధీ కుటుంబం చేతిలో కీలుబొమ్మగా ఉన్న వ్యక్తి ప్రధాన మంత్రిగా ఉన్నారని తెలిపారు. నేడు మన ప్రధాని మోదీ ప్రపంచాన్ని శాశించే స్థాయిలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో 12 లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగితే.. మోదీ పాలనలో రూపాయి కూడా అవినీతి లేని నీతివంతమైన పాలన అందించామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ నిలిచిందని.. యావత్ ప్రపంచానికి నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ దిగారని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు సెలవు తీసుకోకుండా పని చేసిన వ్యక్తి మోదీ అని పేర్కొన్నారు.

గతంలో దేశంలో తీవ్రవాదుల ఆగడాలు కొనసాగినా.. మౌనం పాటించి ఊరుకుంది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. కానీ బీజేపీ తొమ్మిది సంవ్సరాల పాలనలో ఎటువంటి ఉగ్రవాద చర్యలు లేకుండా పాలన సాగుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో పాకిస్తాన్ సైనికులు వేల మంది భారతీయ సైనికుల ప్రాణాలు తీశారని.. మోదీ ప్రధాని అయ్యక పాకిస్తాన్ చర్యలను సర్జికల్ స్ట్రైక్ ద్వారా తిప్పికొట్టామన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలో యుద్ధం ఆపించి వేల మంది భారతీయులను వెనక్కి తీసుకొచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదని తెలిపారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తే వ్యాక్సిన్ కనుగొని ప్రపంచానికి అందించిన ఘనత బీజేపీ సర్కార్‌ది అన్నారు. కరోనాతో పనుల్లేక పేదలు అల్లాడుతుంటే గత మూడున్నర సంవత్సరాలుగా ఉచితంగా బియ్యం అందిస్తున్నామన్నారు.

అన్ని దేశాలు డబ్బులకు కరోనా వ్యాక్సిన్ ఇస్తే దేశంలో ఉన్న 140 కోట్ల మంది ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించిన ఘనత మోదీదన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలో, రైల్వేలను అభివృద్ధి చేశామని తెలిపారు. దేశంలో జాతీయ రహదారులను అభివృద్ది చేసిన ఘనత నాడు వాజ్‌పేయిది.. నేడు మోదీది అని ఆయన పేర్కొన్నారు. మోదీ ఆధ్వర్యంలో దేశంలో అనే రంగాలలో అభివృద్ధి చేస్తున్నామన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు