టీబీజేపీ 100రోజుల యాక్షన్ ప్లాన్...నడ్డా వార్నింగ్ వర్కవౌట్ అయినట్లేనా..?

తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ బీజేపీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళిక రచిస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలను పరిగణలోనికి ఈ యాక్షన్ ప్లాన్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. వంద రోజుల పాటు నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ రూపొందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ..జనం సమస్యలపై పోరాడేలా ఈ ప్లాన్ ను రెడీ చేస్తున్నారు. అయితే నిన్నగాక మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా...టీబీజేపీ నేతలకు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. లొల్లి పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలంటూ హెచ్చరించారు. మొత్తానికి జేపీ నడ్డా వార్నింగ్ పనిచేసినట్లే కనిపిస్తోంది.

New Update
టీబీజేపీ 100రోజుల యాక్షన్ ప్లాన్...నడ్డా వార్నింగ్ వర్కవౌట్ అయినట్లేనా..?

తెలంగాణ బీజేపీ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే వందరోజుల ప్రణాళికను సిద్ధం చేస్తోంది. అధికార పార్టీ వైఫల్యాలను ఎక్కడిక్కడ ఎండగడుతూ...కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ పథకాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తోంది. దీనిపై చర్చించేందుకు సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పై అంశాలపై చర్చించారు.

publive-image

నేడు మరోసారి సమావేశమై...తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి అంశాలపై ప్రజల్లోకి వెళ్లాలి. పార్టీని సంస్థాగతంగా ఎలా బలోపేతం చేయాలన్న అంశాలపై నేటి సమావఏశంలో చర్చించి ప్రకటించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ ఎన్నికల ఎన్నికల ఇంచార్జీ ప్రకాశ్ జవదేకర్,సునీల్ బస్సల్, లక్ష్మణ్, డీకే అరుణతోపాటు తదితరులు పాల్గొన్నారు.

కాగా ఇప్పటివరకు పూర్తి చేయని పార్టీ పరమైన కార్యక్రమాలను వచ్చేనెల 15లోపు పూర్తి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ వందరోజుల కార్యక్రమాల్లో తప్పకుండా హాజరుకావాలని పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బీఆర్ఎస్ మీద ఉద్యమ కార్యాచరనను ఇవాళ ఫైనల్ చేయనున్నారు. ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగాలని కిషన్ రెడ్డి తెలిపారు.

ఈ వందరోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఇంటింటికి వెళ్లి బీఆర్ ఎస్ వైఫల్యాను ఎత్తిచూపడం, బీజేపీని ప్రజలకు చెంతకు తీసుకు వెళ్లడం, నియోజకవర్గాల్లో బహిరంగసభలు నిర్వహించాలని సూచించారు. ప్రముఖులను కలవడంపై స్పీడ్ పెంచాలన్నారు. రాష్ట్రంలోని 12 ఎస్టీ, 19 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగసభలు, 10 ఉమ్మడి జిల్లాల్లో త్వరలోనే అధ్యక్షుడు కిషన్ రెడ్డి పర్యటించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అయితే ఏయే తేదీల్లో పర్యటనలను ఉన్నాయనేది నేడు ఖరారు చేయనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు