TG Assembly 2024: తెలంగాణలో ఈ రోజు విద్యుత్ రంగంపై జరిగిన చర్చ సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి. జగదీశ్ రెడ్డిపై కేసులు ఉన్నాయని.. కోమటిరెడ్డి బ్రదర్స్ ఆరోపించారు. దమ్ముంటే అవి నిరూపించాలని.. లేకపోతే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు సీఎం రాజీనామా చేయాలని జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు. లేకపోతే ఈ చెత్తగాళ్ల మాటలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు.
జగదీశ్ రెడ్డి మర్డర్ కేసులో 16 ఏళ్లు కోర్టు చుట్టూ తిరిగాడని వెంకట్ రెడ్డి అన్నారు. పెట్రోల్ బంక్ లో దొంగతనం చేశాడని కూడా ఆరోపణలు చేశారు. జగదీశ్ రెడ్డి ఛాలెంజ్ కు తాను సిద్ధమన్నారు. నిరూపించలేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధమన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.