తెలంగాణ శాసనసభకు సంబంధించి మూడు కమిటీలను స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. పీఏసీ చైర్మన్ గా అరికపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్ పర్సన్ గా పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ గా శంకరయ్యను నియమించారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులు బులిటెన్ విడుదల చేశారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తూ ఉందని.. కానీ, కాంగ్రెస్ లో చేరిన అరికపూడి గాంధీకి ఇవ్వడం ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
ఈ వార్త అప్డేట్ అవుతోంది..