Telangana Speaker: తెలంగాణ శాసనసభ స్పీకర్‌ ఎన్నిక ఎప్పుడంటే..

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను డిసెంబర్ 14వ తేదీన ఎన్నుకోనున్నారు. 11 లేదా 12వ తేదీన స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 14న ఎన్నిక జరుగుతుంది. సభలో కాంగ్రెత్ ఆధిక్యం ఉండటంతో.. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక దాదాపు ఖాయమైపోయింది.

New Update
Telangana Assembly: ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Assembly Speaker Elections: తెలంగాణ అసెంబ్లీ సమావేశం శనివారం జరిగిన విషయం తెలిసిందే. మూడవ అసెంబ్లీ తొలి సమావేశంలో కొత్త ఎన్నికమైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికైన అక్బరుద్దీ ఒవైసీ.. వీరిచే ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే, పూర్తిస్థాయి స్పీకర్‌ను డిసెంబర్ 14వ తేదీన అసెంబ్లీ ఎన్నుకోనుంది. అదే రోజున స్పీకర్ ఎంపిక కోసం ఎన్నిక నిర్వహిస్తారు. అదే రోజున స్పీకర్‌ బాధ్యతలు కూడా చేపడతారు. కాంగ్రెస్ తరఫున స్పీకర్ అభ్యర్తిగా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌ను ప్రకటించింది. సభలో కాంగ్రెస్‌కు అవసరమైన పూర్తిస్థాయి మెజార్టీ ఉంది. దాంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే స్పీకర్‌గా ఎన్నికవడం ఖాయం అని చెప్పొచ్చు.

కాగా, స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఈ నెల 11న గానీ 12వ తేదీన గానీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక 12వ తేదీన మంచి రోజు ఉందని పండితులు చెబుతున్నారు. ఆ రోజునే కాంగ్రెస్ తరఫున ప్రసాద్ కుమార్ నామినేషన్ వేయనున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. ఇక సంప్రదాయం ప్రకారం.. శాసనసభా వ్యవహారల మంత్రి అయిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. సభలో బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ శాసనసభాపక్ష నేతలను కలిసి స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించాలని కోరునున్నారు.

15వ తేదీన గవర్నర్ ప్రసంగం..

అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక అనంతరం.. డిసెంబర్ 15వ తేదీన ఉదయం 11.30 గంలకు అసెంబ్లీ, శాసన మండలిని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించనున్నారు.

Also Read: 

చిన్న రాష్ట్రం.. మూడున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చుకుంది..

అగ్గిపుల్ల ఇవ్వలేదని వాచ్‌మెన్‌పై యువకుడి దాడి.. తల పగిలేల కొట్టి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు