తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నల్గొండ టూర్‌కి వెళ్లిన మంత్రి కేటీఆర్‌పై ఎంపీ కోమటిరెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. -సిరిసిల్ల లో 20వేల డబుల్ బెడ్రూమ్ లు కట్టుకున్న కేటీఆర్ ,దత్తత నియోజకవర్గం నల్గొండ లో ఎన్ని కట్టిర్రో చెప్పాలని విమర్శలు గుప్పించారు
ఎంపీ కోమటిరెడ్డి ఏం అన్నారంటే?
➼ 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం ఈ యూనివర్సిటీని కనీసం పట్టించుకోలేదు
➼ 4,000 మంది విద్యార్థులు ఉన్న కనీసం వారికి మౌలిక సదుపాయాలు కల్పించలేదు
➼ అక్టోబర్ 2 గాంధీ జయంతి మంచి రోజు ఈ రోజు నుండే ఎన్నికల ప్రచారం మొదలుపెడుతున్నా..
➼ నల్గొండ ప్రజలు 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా,గత 5 ఏండ్లుగా ఎంపీగా అవకాశం ఇచ్చారు.
➼ ప్రభుత్వ సపోర్ట్ లేకపోయినా ఈ ఐదేళ్లలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి చేశాను.
➼ నల్గొండనే నా ప్రాణం..
➼ చివరి శ్వాస వరకు నల్గొండకు సేవ చేయాలనేది నా కోరిక..
➼ పెద్దలను గౌరవించడం, పేదలను ప్రేమించడం,ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం నా నైజం.
➼ ఏం ముఖం పెట్టుకొని హెలికాఫ్టర్‌లో నల్గొండకు వస్తున్నావ్ కేటీఆర్...?
➼ వ్యక్తిత్వం లేని ఎమ్మెల్యేను ఇక్కడ పెట్టి, నల్గొండను దత్తత తీసుకుంటానని మాయమాటలు చెప్పిన కేటీఆర్ ఈ ఐదేళ్లలో నల్గొండ లో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలి.
➼ సిరిసిల్లలో 20వేల డబుల్ బెడ్రూమ్‌లు కట్టుకున్న కేటీఆర్ ,దత్తత నియోజకవర్గం నల్గొండలో ఎన్ని కట్టిర్రో చెప్పాలి.
➼ కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టడం,దళితబంధులు కమిషన్లకు అమ్ముకోవడమే ఇక్కడ ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి.
➼ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది..
➼ ఇక్కడి పాపాల ఎమ్మెల్యే ఇంటికి పోవడం గ్యారెంటీ.
➼ నిస్వార్థంగా, నిజాయితీగా పనిచేసిన నన్ను మరొకసారి మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండని నల్గొండ ప్రజలను కోరుతున్నాను.
నల్లగొండలో టీ-హబ్, టాస్క్ కేంద్రాలకు కేటీఆర్ హామీ:
తెలంగాణలోని టైర్-2 ప్రాంతాల్లో నల్లగొండ ఐటీ టవర్ అత్యుత్తమ ఐటీ టవర్ అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీ టవర్‌ను ప్రారంభించిన తర్వాత ఉద్యోగులతో కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టైర్ -2 ప్రాంతాల్లో నల్లగొండ ఐటీ టవర్ అత్యుత్తమ ఐటీ టవర్‌గా నిలిచిందన్నారు. నల్గొండ ఐటీ టవర్‌కు తమ స్నేహితులను ఆహ్వానించాలని ఆయన ఉద్యోగులను కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీ టవర్లను అభివృద్ధి చేయడమే కాకుండా యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని, నల్లగొండ ఐటీ టవర్ లో మరిన్ని సౌకర్యాల కోసం ఎంత నిధులైనా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వీటితో పాటు నల్లగొండలో టీ-హబ్, టాస్క్ కేంద్రాలను కూడా త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: గాంధీ లాంటి మహనీయుడుకి కూడా జైలు జీవితం తప్పలేదు..దీక్ష విరమించిన నారా భువనేశ్వరి!