Caste Wise Census: తెలంగాణ సెకండ్ సెషన్ ఏడోరోజు అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. నిన్న శాసనమండలి నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ రోజు కులనణనపై ప్రభుత్వం తీర్మానం చేయనుంది. ఇక రాష్ట్రంలో నీటిపారుదల శాఖపై శ్వేత పత్రం విడుదల చేయనుంది ప్రభుత్వం. నిజానికి నిన్న సభలో కుల జనగణన తీర్మానం పెట్టాలని సర్కార్ భావించింది. అయితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బిల్లుపై చర్చ ఆలస్యం అవడంతో కులగణన తీర్మానం ఇవాళ్టి(ఫిబ్రవరి 16)కి వాయిదా పడింది.
బీసీలకు రిజర్వేషనే అజెండా:
ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే కులగణన తీర్మానం పెట్టనున్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీ కులగణనపై ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి లో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. బీహార్ తరహాలో సమగ్ర కులగణన చేయాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి. ఇప్పటికే ఏపీలో కులగణన పూర్తికావస్తోంది.
దేశంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్ కోట 50శాతం సీలింగ్ ఎత్తివేస్తామంటోంది కాంగ్రెస్ పార్టీ. బీహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణలో కులగణన చేస్తామని చెబుతోంది. న్యాయవివాదాల్లో చిక్కుకోకుండా క్యాస్ట్ సెన్సెస్ పూర్తి చేయాలని బీసీ నేతలు కోరుతున్నారు ఆ తర్వాత నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం పెట్టనుంది ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్రంలో హాట్ హాట్ గా వాటర్ పాలిటిక్స్ సాగుతున్న విషయం తెలిసిందే. KRMBపై బీఆర్ఎస్.. గోదావరి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నాయి. నేడు అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ శ్వేత పత్రం పై జరిగే చర్చ మరింత పొలిటికల్ హిట్ పెంచనుంది. నిన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పై అసెంబ్లీలో పెట్టిన కాగ్ రిపోర్టు పలు లోపాలు ఎత్తి చూపింది. ఇక నేటితో అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.
Also Read: వివాహ సమానత్వానికి పెద్దపీట.. చారిత్రాత్మక బిల్లుకు క్రిస్టియన్ కంట్రీ ఆమోదం!