Asifabad Issue: ఆసిఫాబాద్‌లో ఆగని అల్లర్లు.. ఇండ్లు తగలబెట్టుకున్న ఇరువర్గాలు!

ఆసిఫాబాద్ జిల్లాలో మహిళ అత్యాచార ఘటనపై అల్లర్లు చెలరేగుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలటూ బాధితురాలి బంధువులు ఏజెన్సీ బంద్ కు పిలుపునిచ్చారు. పలు షాపులు, ఇండ్లకు నిప్పంటించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

New Update
Asifabad Issue: ఆసిఫాబాద్‌లో ఆగని అల్లర్లు.. ఇండ్లు తగలబెట్టుకున్న ఇరువర్గాలు!

Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలో ఓ మహిళపై జరిగిన అత్యాచార సంఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా అత్యాచార సంఘటన నిరసిస్తూ తమకు న్యాయం చేయాలంటూ బాధితురాలి బంధువులు రోడ్డుపై ధర్నాకు దిగారు. అత్యాచారం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ బందుకు పిలుపునివ్వగా మార్కెట్ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇక మహిళపై అత్యాచారం చేసి హత్య ప్రయత్నం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య తెలిపారు.

ఇక ప్రస్తుతం గాంధి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న మ‌హిళ‌ను మంత్రి సీత‌క్క పరామర్శించారు. బాధితురాలికి అందుతున్న చికిత్సపై వైద్యులను ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాల‌ని డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆసుప‌త్రి నుంచే జిల్లా ఎస్పీతో మాట్లాడి ఘనట వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులు ఎంత‌టి వారైనా వ‌దిలి పెట్టేదిలేదని, బాధితురాలి కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని సీతక్క హ‌మీ ఇచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు