దొడ్డి కొమురయ్య సొంతూరులో ఘనంగా వర్ధంతి ఉత్సవాలు

భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఎర్రబెల్లి ఉషా దయాకర్‌రావు మరియు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పూనంనేని సాంబశివరావు, ప్రజా గాయకురాలు విమలక్కతో కలిసి దొడ్డి కొమురయ్య సొంతూరు అయినటువంటి కడవెండి గ్రామంలో మంగళవారం డప్పు చప్పుళ్ల మధ్య ఘనంగా ఆవిష్కరించారు.

దొడ్డి కొమురయ్య సొంతూరులో ఘనంగా వర్ధంతి ఉత్సవాలు
New Update

telangana-armed-struggle-doddi-komuraiah-anniversary-celebrations-participate-leaders

తుపాకీ తూటాలకు ఎదురు నిలిచి వీరమరణం పొంది నేటికి 77 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తన సొంతూరులో ఘనంగా నివాళులు అర్పిస్తూ తాను చేసిన పనులను గుర్తు చేసుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దొడ్డి కొమురయ్య జయంతిని, వర్ధంతిని అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఆయన జయంతి వేడుకలు నిర్వహిస్తుండగా, ప్రథమంగా ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్ధంతి వేడుకలను నిర్వహిస్తున్నది.

దొడ్డి కొమురయ్య స్వస్థలం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామం. అయితే సొంతూరు అయినటువంటి గ్రామంలో ఆయన స్మారక స్తూపం ఉండగా దానిపక్కనే దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రస్తుత పంచాయతీ రాజ్‌ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సౌజన్యంతో ఏర్పాటు చేయగా నేడు అతిథులతో కలిసి పాశం యాదగిరి దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని డప్పుచప్పుళ్ల మధ్య ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe