మేడ్చల్-మల్కాజ్‌గిరి పరిధిలోని ఉప్పల్ రింగ్‌రోడ్డు చౌరస్తాలో రూ. 36.50 కోట్ల వ్యయంతో నిర్మించిన స్కైవాక్‌ను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ నిర్మాణంతో హైదరాబాద్ మహానగరంలో ఉప్పల్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. పాదచారుల మార్గం సుగమం కానుంది.
ఈ స్కైవాక్ దేశంలోనే అతి పెద్దదట. ముఖ్యంగా ఉప్పల్ చౌరస్తాలో రోడ్డు దాటే సమయంలో తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇక ఆ దారిలో నడిచే పాదచారుల కష్టాలు తీరనున్నాయి. రింగురోడ్డులో ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీగా వాహనాల రాకపోకలకు అవకాశం కలుగబోతోంది.
స్కై వాక్ విశేషాలు
దీని నిర్మాణంలో 8 లిఫ్టులు, 6 స్టేర్ కేసులు, 4 ఎస్కిలేటర్లు ఉన్నాయి. మొత్తం 37 పిల్లర్లు, 660 మీటర్ల పొడవు, 6 మీటర్ల ఎత్తులో దీన్ని ఏర్పాటు చేశారు. బ్యూటిఫికేషన్ కోసం పై భాగంలో కేవలం 40 శాతం మేరకు రూఫ్ కవరింగ్ ఏర్పాట్లు చేశారు. నేరుగా మెట్రో స్టేషన్ లోపలికి వెళ్లే వీలుంది. ఈ స్కై వాక్ వందేళ్ల పాటు సేవలు అందించేలా డిజైన్ చేశారు. స్కైవాక్ పైన, కింద, పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీలను ఏర్పాటు చేశారు. ఇరువైపులా రెయిలింగ్ ఉంది. ఇక్కడ అమర్చిన ఎల్‌ఈడీ దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆరు చోట్ల ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి. నాగోల్ మెట్రోస్టేషన్, రామంతాపూర్ రోడ్, జీహెచ్‌ఎంసీ థీమ్ పార్కు, వరంగల్ బస్టాప్ లకు ఇకపై ఈజీగా వెళ్లవచ్చు.