విద్యార్థులకు అలెర్ట్.. స్కూల్‌ టైమింగ్స్‌లో కొత్త మార్పులివే..!

రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత తరగతుల పాఠశాలల వేళలను మార్చుతు తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నోటిఫికేషన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభమై. సాయంత్రం 4.15 గంటల వరకు కొనసాగుతాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు కొనసాగుతాయి.

విద్యార్థులకు అలెర్ట్.. స్కూల్‌ టైమింగ్స్‌లో కొత్త మార్పులివే..!
New Update

school timings changed in telangana ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ(telangana)లో హైదరాబాద్, సికింద్రాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత తరగతుల పాఠశాలల వేళలను విద్యా శాఖ మార్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్జేడీఎస్ఈలకు విద్యాశాఖ పంపించింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు(primary schools) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేస్తున్నాయి. కొత్త నోటిఫికేషన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభమై. సాయంత్రం 4.15 గంటల వరకు కొనసాగుతాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు కొనసాగుతాయి. ఉన్నత పాఠశాలల సమయాల్లో ఎలాంటి మార్పులు చేయని విద్యాశాఖ.. కేవలం ప్రాథమిక పాఠశాలల సమయాల్లోనే మార్పులు చేసింది.

జంట నగరాల్లో మార్పులు లేవు:
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల విషయానికొస్తే, పాఠశాలల సమయాల్లో ఎలాంటి మార్పు లేదని, అందుకే అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్న సమయాలను అనుసరిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. విద్యా హక్కు చట్టం, సమగ్ర సర్వే ఆధారంగా ప్రస్తుత పాఠశాల సమయాలను నిర్ణయించారు.మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ట భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ కొత్త నిర్ణయం వల్ల తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళనకు చెందుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (TSUTF) ఈ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఇది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతోంది. TSUTF ప్రధాన కార్యదర్శి చావ రవి ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. “గ్రామీణ ప్రాంతాల్లో, తల్లిదండ్రులు సాధారణంగా తమ పిల్లలను తమ పొలానికి లేదా కూలీ పనులకు వెళ్లే ముందు పాఠశాల్లో విడిచిపెడతారు. 30 నిమిషాల సమయ మార్పు కూడా తల్లిదండ్రులకు ఇబ్బందులను సృష్టిస్తుంది. వారి పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించేలా చేస్తుంది' అని చావ రవి అభిప్రాయపడుతున్నారు. ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ బస్సులకు భిన్నంగా విద్యార్థులకు ఉదయాన్నే రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయన్నారు రవి. పని వేళల్లో ఏదైనా మార్పు చేయాలంటే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకునే ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయాలను సేకరించాలని రవి కోరుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం కొంత మంది ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా ఉంటుందని, అయితే ఇది విద్యార్థులకు, తల్లిదండ్రులకు మేలు చేయదని ఆయన నొక్కి చెప్పారు.

వర్షం ముప్పు:
ఇదిలావుండగా, రానున్న రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది . జూలై 25(ఇవాళ్టి) నుంచి జూలై 28 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 'అత్యంత భారీ వర్షం' కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది. అటు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(GHMC) అధికారులు ఇప్పటికే నగరంలోని ప్రజలు అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని, అవసరమైతేనే బయట అడుగు పెట్టాలని హెచ్చరిస్తున్నారు. ఇటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(DRF) బృందాలను అప్రమత్తం చేశామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తెలిపింది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe