/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/saichand.jpg)
సాయిచంద్...తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసన సమయంలో తన పాటతో కోట్లాది మందిని కదిలించారు. జానపదాన్ని నింపుకుని జనం గొంతుకై నిలిచిన పాటా వాడవాడలా ప్రతిధ్వనించింది. ఆయన పాటకు తెలంగాణ సమాజం ఉద్వేగంతో ఊగిపోయింది. ఉద్యమ సమయంలో సాయిచంద్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు సాయిచంద్ మరణవార్త విన్న తెలంగాణ సమాజం షాక్ కు గురైంది. కళాకారులు కన్నీటిపర్యంతమవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సాయిచంద్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. సాయిచంద్ మరణ వార్త తెలియగానే పార్టీ ప్రముఖులంతా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వెళ్లి ఆయనకు నివాళులర్పించారు.
సాయిచంద్ అకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సిఎం సంతాపాన్నిప్రకటించారు. ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని..కళాకారున్ని కోల్పోయిందన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అన్నారు. మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. రాష్టర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుందని సీఎం అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో సాయిచంద్ పాడిన పాటలను చేసిన సాంస్కృతిక ఉద్యమాన్ని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. సాయిచంద్ లేకుండా తన సభలు సాగేవి కావని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు తన ఆట పాటలను నిరంతరాయం కొనసాగిస్తూనే ఉన్నాడని గుర్తు చేసుకున్నారు. తన ఆట పాటతో ప్రజలలో నాడు ఉద్యమ స్పూర్తిని నేడు అభివృద్ధి చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ బిడ్డని కోల్పోవడం తీరని లోటని అన్నారు. శోకతప్త హృదయులైన సాయిచంద్ కుటుంబ సభ్యులు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే శక్తినివ్వాలని భగవంతున్ని ప్రార్థించారు. వారి కుటుంబానికి తాము అండగా వుంటామన్నారు. వారి కుటుంబ సభ్యలకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.