Telangana: సీఎం రేవంత్ రెడ్డికి చిన్నారి లేఖ.. ఏం కోరిందంటే..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 5వ తరగతి విద్యార్థిని లేఖ రాసింది. తన పుట్టిన రోజు నాడు సీఎంను ఓ కోరిక కోరింది. తమ ప్రభుత్వ స్కూలుకు ఉచిత విద్యుత్ అందించాలని వేడుకుంది. మరి దీనిపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠగా మారింది.

New Update
Telangana: సీఎం రేవంత్ రెడ్డికి చిన్నారి లేఖ.. ఏం కోరిందంటే..

Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్క్ పాలనతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచాతప్పకుండా పాటిస్తూ అందరితో శభాష్ సీఎం అనిపించుకుంటున్నారు. ఇప్పటికే దివ్యాంగురాలైన రజనికి జాబ్ ఇచ్చి మాట నిలపెట్టుకున్నారు. ఈ క్రమంలో ఓ ఐదో తరగతి చిన్నారి సీఎంకు రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశమయింది. ఇంతకు ఎవరా చిన్నారి.. సిఎం ను కోరిన కోరిక ఏంటి ? పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇప్పటికే రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన ప్రజావాణికి విశేష స్పందన లభిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను తీర్చాలంటూ రేవంత్ సర్కారుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఐదో తరగతి చదువుతున్న ఓ చిన్నారి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీని గుర్తు చేస్తూ.. ఐదో తరగతి విద్యార్థిని తన పుట్టిన రోజున గిఫ్ట్‌గా ఓ కోరిక కోరింది.

"గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి వ్రాయునది.. సీఎంగా మీరు ఎన్నికైనందుకు శుభాకాంక్షలు. దయచేసి మా ప్రభుత్వ స్కూలుకు ఉచిత విద్యుత్ అందించాలని మనవి." అని కోరుతూ.. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లకు చెందిన 5వ తరగతి విద్యార్థిని అంజలి తన పుట్టిన రోజు సందర్భంగా లేఖ రాసి సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నారి లేఖపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. ఎంతో ధైర్యంగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసి తన కోరికను తెలియజేసినందుకు చిన్నారిని అభినందిస్తున్నారు.

Also Read:

దేశంలో బారీగా పెరిగిన కరోనా కేసులు.. ఒక్క రోజే ఏకంగా..

విడాకులు తీసుకుని మళ్లీ కలిశారు.. బాబు-పవన్‌పై మంత్రి బొత్స పంచ్‌లే పంచ్‌లు..

Advertisment
తాజా కథనాలు