గొర్రెల పంపిణీ స్కామ్‌.. కీలక నిందితులు అరెస్ట్!

గొర్రెల పంపిణీ స్కామ్ లో పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ సబావత్‌ రాంచందర్ తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద OSDగా పని చేసిన కల్యాణ్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. వీరిద్దరు దాదాపు రూ.2.10 కోట్ల అవినీతికి పాల్పడ్డట్లు గుర్తించారు.

New Update
గొర్రెల పంపిణీ స్కామ్‌.. కీలక నిందితులు అరెస్ట్!

గొర్రెల పంపిణీ స్కామ్‌లో ఏసీబీ దూకుడు పెంచింది. కీలక నిందితులను అరెస్టు చేసింది. పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ సబావత్‌ రాంచందర్ తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద OSDగా పని చేసిన కల్యాణ్ ను అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరు నిందితులు రూ.2.10 కోట్ల అవకతవకలకు పాల్పడ్డట్లు ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 10 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది. దీంతో భవిష్యత్ లో ఈ కేసులో ఇంకా ఎవరిని అరెస్ట్ చేస్తారు? అన్న అంశం పశుసంవర్ధక శాఖ వర్గాల్లో టెన్షన్ పుట్టిస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు