ఆ కుటుంబంలో చీకట్లను నింపిన దీపావళి.. కళ్లముందే కవలల దుర్మరణం.. కోమాలోకి తల్లి! తల్లి కళ్లముందే కవలలు దుర్మరణం చెందిన విషాదకర ఘటన మెదక్ లో చోటుచేసుకుది. దీపావళి పండగనాడు బాణసంచా కొనేందుకు కొడుకులను తీసుకుని స్కూటిపై వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టింది. తలలపై నుంచి టిప్పర్ వెళ్లగా కుమారులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా అన్నపూర్ణ కోమాలోకి వెళ్లింది. By srinivas 14 Nov 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి భర్తను కోల్పోయిన బాధ నుంచి తెరుకోకముందే అన్నపూర్ణ జీవితంలో ఈ దీపావళి కారు చీకట్లు నింపింది. ఇద్దరు కొడుకులే తన ప్రాణంగా బతుకుతున్నఆమెకు ఈ పండుగ తీరని శోకం మిగిల్చింది. రెండేళ్ల క్రితం భర్తను బలితీసుకున్న రోడ్డు.. ఇప్పుడు ఇద్దరు కొడుకులను కూడా బలితీసుకోవడం తట్టుకోలేక కోమాలోకి వెళ్లింది. ఈ భయంకరమైన సంఘటన గురించి తెలియగానే కుటుంబ సభ్యులు, సన్నిహితులు బోరున విలపిస్తున్నారు. ఒంటరిగా మిగిలిన అన్నపూర్ణను చూసి ఇలాంటి కష్టం ఏ తల్లికి రాకూడదంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ మేరకు మెదక్ పట్టణ సీఐ వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం.. టేక్మాల్ మండలం కాదలూర్‌కు చెందిన బేగరి శ్రీనివాస్, అన్నపూర్ణ దంపతులకు పృధ్వీతేజ్ (12), ప్రణీత్ తేజ్ (12) కవల పిల్లలున్నారు. అయితే గతంలో మెదక్‌లో డీఎస్పీ వద్ద హోంగార్డుగా పనిచేసే శ్రీనివాస్ అన్నాసాగర్ వద్ద 2021లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పటి నుంచి అన్నపూర్ణ పిల్లల బాధ్యతలు చూస్తుంది. దీంతో దీపావళి పండగకు బాణసంచా కొనేందుకు పిల్లలను స్కూటీపై తీసుకుని అన్నపూర్ణ బయలుదేరింది. ఈ క్రమంలోనే ఆటోనగర్ వద్దకు రాగానే వెనక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో కిందపడ్డారు. పిల్లలిద్దరూ కుడివైపు పడిపోగా వారి తలలపై నుంచి టిప్పర్ వెళ్లడంతో నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మరణించారు. తల్లి అన్నపూర్ణ ఎడమ వైపు పడటంతో ప్రాణాలతో బయటపడింది. మెదక్‌లో ప్రాథమిక చికిత్స అనంతరం సోమవారం సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కళ్లెదుటే పిల్లలను కొల్పోవడంతో అన్నపూర్ణ కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం జరగ్గానే టిప్పర్ డ్రైవరు పరారైనట్లు స్థానికులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, కాదలూర్‌లో పిల్లలిద్దరికీ అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగినట్లు సీఐ వెంకట్ వివరించారు. Also read : అమీషాను దారుణంగా అవమానించిన కరీన.. మరీ అలా అనేసిందేంటి #twins-died #mother-in-coma #tekmal #kaddalore మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి