/rtv/media/media_files/2025/12/04/ray-ban-ai-glasses-2025-12-04-14-27-17.jpg)
Ray-Ban AI Glasses
Ray-Ban AI Glasses: ప్రఖ్యాత స్మార్ట్ గ్లాసెస్ రే-బ్యాన్ మెటా (Gen 2) AI గ్లాసెస్ ఇప్పుడు భారత మార్కెట్‌లో లభ్యం అవుతున్నాయి. ప్రారంభ ధర ₹39,900 నుండి మొదలై, ఈ గ్లాసెస్ దేశవ్యాప్తంగా రే-బ్యాన్ ఇండియా వెబ్‌సైట్, ప్రముఖ ఆప్టికల్ షోరూంలు, అద్దాల స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.
డిజైన్..
రెండు జనరేషన్ గ్లాసెస్‌లలోనూ డిజైన్ పెద్దగా మారలేదు. కానీ కెమెరా, బ్యాటరీ లైఫ్, AI ఫీచర్స్ వంటి అంశాల్లో భారీ మార్పులు చేసారు. ఈ కొత్త మోడల్ మూడు శైలీల్లో అందుబాటులో ఉంది - హెడ్‌లైనర్, స్కైలర్, వెయ్‌ఫేర్. అలాగే వినియోగదారులు Shiny Cosmic Blue, Shiny Mystic Violet, Shiny Asteroid Grey వంటి సీజనల్ కలర్స్‌లో ఎంపిక చేసుకోవచ్చు.
కెమెరా ఫీచర్స్
రే-బ్యాన్ మెటా జెన్ 2 గ్లాసెస్‌లో 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. రెండు సర్క్యులర్ కట్ అవుట్స్‌లో LED లైట్ ఉంది, ఇది వీడియో రికార్డింగ్ సమయంలో ఆడియో/వీడియో రికార్డింగ్ సూచికగా పనిచేస్తుంది. కెమెరా అప్‌గ్రేడ్ అయ్యి 3K రిజల్యూషన్‌లో 30 fps వీడియోలు రికార్డ్ చేయగలదు. ఫోటోలు ఇంకా 3,024 x 4,032 పిక్సెల్స్ రిజల్యూషన్‌లో తీసుకోవచ్చు. భవిష్యత్తులో స్లో మోషన్, హైపర్‌ల్యాప్స్ మోడ్ కూడా అందుబాటులోకి వస్తాయి.
Also Read: మెగాస్టార్ ‘ఎంఎస్‌జీ’ క్రేజీ అప్‌డేట్.. ‘శశిరేఖ’ వచ్చేస్తోంది..!
స్మార్ట్ ఫీచర్స్
ఈ గ్లాసెస్‌లో కన్‌వర్సేషన్ ఫోకస్ ఉంది. ఓపెన్-ఎయర్ స్పీకర్స్ ద్వారా మీరు మాట్లాడే వ్యక్తి గొంతు స్పష్టంగా వినిపిస్తుంది. 5 మైక్రోఫోన్ అరే శబ్దాన్ని తగ్గించి, క్లారిటీతో వాయిస్/వీడియో కాల్స్ చేయగలదు.
బ్యాటరీ & ఛార్జింగ్
మెటా ప్రకారం, జెన్ 2 గ్లాసెస్ ఒక సింగిల్ ఛార్జ్‌లో 8 గంటల వరకు ఉపయోగించవచ్చు. ప్రత్యేక కేస్‌తో అదనంగా 48 గంటల చార్జింగ్ అందిస్తుంది.
కొనుగోలు & లభ్యత
రే-బ్యాన్ మెటా జెన్ 2 గ్లాసెస్ ఇప్పుడు భారతదేశంలోని ప్రధాన ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, రే-బ్యాన్ షోరూంలు, ఆప్టికల్ రీటైలర్లు ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రిజ్రిప్షన్, సన్, పాలరైజ్డ్, ట్రాన్సిషన్స్ లెన్స్ ఆప్షన్స్ అందుతాయా అనేది ఇంకా ప్రకటన రాలేదు. ఈ కొత్త AI గ్లాసెస్ వినియోగదారులకు స్మార్ట్ ఫీచర్స్, స్టైల్, బెటర్ కెమెరా, లాంగ్ బ్యాటరీ లైఫ్ అందిస్తూ అత్యాధునిక స్మార్ట్ గాడ్జెట్ అనుభవాన్ని ఇస్తాయి.
Follow Us