/rtv/media/media_files/2025/03/16/MjmVZ7D7o8RYq5U9yXb8.jpg)
Sunita Williams
అంతరిక్ష పరిశోధన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యోమగామి సునీతా విలియమ్స్ NASAతో తన ప్రయాణాన్ని ముగించింది. ఆమె 27 ఏళ్ల సర్వీసుకు గురువారం గుడ్‌బాయ్ చెప్పారు. సునీతా విలియమ్స్ అంతరిక్ష చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకొని అంతరిక్ష ప్రయాణాలకు ముగింపు పలికారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు నాసాలో విశేష సేవలు అందించిన ఆమె, తన కెరీర్‌లో ఎన్నో రికార్డులను సృష్టించారు. తాజాగా ఆమె పదవీ విరమణతో సునీతా విలియమ్స్‌కు వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ వివరాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
27 ఏళ్ల అద్భుత ప్రస్థానం
1998లో నాసాలో వ్యోమగామిగా ఎంపికైన సునీత, అంతరిక్షంలో అత్యధిక కాలం నడిచిన మహిళగా రికార్డు సృష్టించారు. ఆమె మొత్తం 322 రోజులకు పైగా అంతరిక్షంలో గడిపారు. ఇటీవల ISSకు వెళ్లిన ఆమె, సాంకేతిక కారణాల వల్ల అక్కడ ఎనిమిది నెలల పాటు చిక్కుకుపోయి, సురక్షితంగా భూమికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సాహసోపేత యాత్రే ఆమె కెరీర్‌లో చివరిది కావడం విశేషం.
రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్
అమెరికా ఫెడరల్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం, నాసాలో సుదీర్ఘకాలం పనిచేసిన వ్యోమగాములకు భారీగానే పెన్షన్ లభిస్తుంది. ఆమె సీనియారిటీ, హోదాను బట్టి ఏడాదికి సుమారు 1,50,000 డాలర్ల నుండి 1,90,000 డాలర్ల వరకు (భారత కరెన్సీలో సుమారు రూ. 1.25 కోట్ల నుండి రూ. 1.6 కోట్లు) పెన్షన్ పొందే అవకాశం ఉంది. అమెరికా ప్రభుత్వ 'ఫెడరల్ ఎంప్లాయీస్ హెల్త్ బెనిఫిట్స్' కింద ఆమెతోపాటు కుటుంబానికి జీవితాంతం మెడికల్ సర్వీలు అందుతాయి. నాసా అందించే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇతర సామాజిక భద్రత ప్రయోజనాలు ఆమెకు వర్తిస్తాయి.
రిటైర్మెంట్ తర్వాత సునీతా విలియమ్స్ ఖాళీగా ఉండబోరని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రైవేట్ అంతరిక్ష సంస్థలకు (స్పేస్ ఎక్స్ లేదా బ్లూ ఆరిజిన్ వంటివి) సలహాదారుగా పనిచేయవచ్చు. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌గా లేదా అంతరిక్ష పరిశోధనలపై పుస్తకాలు రాసే అవకాశం ఉంది. మోటివేషనల్ స్పీకర్‌గా ప్రపంచవ్యాప్తంగా యువతకు మార్గనిర్దేశం చేయవచ్చు.
Follow Us