/rtv/media/media_files/2025/11/22/google-big-update-2025-11-22-09-30-32.jpg)
Google Big Update
Google Big Update: ఇన్నాళ్లుగా iPhone వినియోగదారులు AirDrop ద్వారా ఒకరికొకరు చాలా వేగంగా ఫైళ్లు పంపుకుంటూ వచ్చారు. కానీ Android వాడేవారికి ఈ సౌకర్యం లేకపోవడంతో రెండు ప్లాట్‌ఫార్మ్‌ల మధ్య ఫైల్ షేరింగ్ పెద్ద సమస్యగా ఉండేది. గూగుల్ Quick Share ఉన్నప్పటికీ, iPhone తో పనిచేయలేదు.
కానీ ఇప్పుడు గూగుల్ ఈ అడ్డంకిని తొలగించింది. Apple సహాయం లేకుండానే AirDrop ని Android లో పనిచేసేలా చేసింది. ఈ అప్‌డేట్ మొదటగా Pixel 10 సిరీస్ లో వస్తుందని గూగుల్ ప్రకటించింది. తర్వాత మరిన్ని Android ఫోన్‌లకు కూడా ఇది అందించే ప్లాన్ ఉంది.
Android నుండి iPhone కి AirDrop ఎలా ఉపయోగించాలి?
మీ వద్ద Pixel 10 ఉంటే:
- మీరెవరికైనా ఫైల్ పంపాలంటే, ఆ iPhone యూజర్ తమ AirDrop సెట్టింగ్‌ను “Everyone” గా మార్చాలి.
- అప్పుడు ఆ iPhone, Pixel 10 లోని Quick Share లో కనిపిస్తుంది.
- మీరు డివైస్‌ను సెలెక్ట్ చేసి ఫైల్ పంపిస్తే, అది AirDrop మాదిరిగానే వెంటనే షేర్ అవుతుంది.
iPhone నుండి Android కు పంపాలంటే: - Pixel 10 ను కూడా ఓపెన్/డిస్కవరబుల్ చేయాలి.
- ఇప్పుడు iPhone యూజర్ AirDrop ద్వారా మీ Android డివైస్‌కి ఫైల్ పంపవచ్చు.
- అంటే రెండు ప్లాట్‌ఫార్మ్‌ల మధ్య ఫైళ్లు పంపడం ఇప్పుడు చాలా సులభం.
Apple సహాయం లేకుండానే AirDrop ఎలా పనిచేసింది?
చాలా మంది ఇది Apple-Google కలిసి చేసిన ప్రాజెక్ట్ అనుకున్నారు. కానీ ఇది పూర్తిగా మా సొంత టెక్నాలజీతోనే చేశామని గూగుల్ స్పష్టంగా చెప్పింది. Google ప్రతినిధి అలెక్స్ మోరికోని మాట్లాడుతూ..
“ఇది పూర్తిగా మా స్వంత పని. Apple సహాయం తీసుకోలేదు”. అని తెలిపారు. అయితే భవిష్యత్‌లో Apple తో కలిసి పనిచేయడానికి గూగుల్ సిద్ధంగా ఉందని కూడా తెలిపింది.
Android-iPhone AirDrop సేఫ్ ఏనా ??
గూగుల్ ప్రకారం ఇది పూర్తిగా సురక్షితం. డేటా ఎక్కడా సర్వర్లకు వెళ్లదు. లాగ్ చేయబడదు. పీర్-టు-పీర్ కనెక్షన్ ద్వారా నేరుగా రెండు డివైస్‌ల మధ్యే డేటా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సెక్యూరిటీ నిపుణులు కూడా ఈ వ్యవస్థను పరీక్షించారని గూగుల్ తెలిపింది.
Android ఫోన్‌లకు AirDrop ఫీచర్ అందుబాటులోకి రావడం నిజంగా పెద్ద మార్పు. కానీ దీనిపై Apple ఇంకా ఎలాంటి కామెంట్ చేయలేదు. అలాగే Pixel 10 తర్వాత ఇతర Android ఫోన్‌లకు ఈ సపోర్టు ఎప్పుడు వస్తుందనే సమాచారం కూడా త్వరలో తెలుస్తోంది.
Android–iPhone ఫైల్ షేరింగ్ ఇప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గూగుల్ తీసుకొచ్చిన ఈ అప్‌డేట్, రెండు ప్లాట్‌ఫార్మ్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంది.
Follow Us