WhatsApp: వాట్సాప్‌ని దాదాపు స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు. మొదట్లో వాట్సాప్ వచ్చినప్పుడు చాలా పరిమితమైన ఫీచర్లు ఉన్నప్పటికీ క్రమంగా అనేక ప్రత్యేక ఫీచర్లను జోడించి ఇప్పుడు మరింత సౌలభ్యంగా తయారు చేశారు. ఎల్లప్పుడూ వ్యక్తులు వాట్సాప్ ద్వారా ఒకరితో ఒకరు కనెక్ట్ అయి ఉంటారు. ఇప్పుడు ఫోటో పంపాలన్నా, వీడియో పంపాలన్నా, ఏదైనా డాక్యుమెంట్ పంపాలన్నా వాట్సాప్ ద్వారానే అన్ని పనులు జరుగుతున్నాయి.
అయితే కొన్ని మనం కంటిన్యూగా ఎవరికైనా మెసేజ్‌లు చేస్తున్నా.. ఎలాంటి స్పందన రాకపోవడం చూస్తుంటాం. ఇది మీకు కూడా జరుగుతున్నట్లయితే, ఆ వ్యక్తి మిమల్ని బ్లాక్ చేయబడే అవకాశం ఉందని భావించండి. చాలా సార్లు మనం బ్లాక్ చేయబడ్డామని గ్రహించలేము. మీరు బ్లాక్ చేయబడ్డారా అనే తెలిపే కొన్ని సంకేతాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..
లాస్ట్ సీన్ కనిపించదు
ఎదుటి వ్యక్తి వ్వాట్సాప్ లాస్ట్ సీన్ చూడలేకపోతే.. మీరు బ్లాక్ చేయబడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మరో ఛాన్స్ కూడా ఉంది. సెట్టింగ్స్ లో లాస్ట్ సీన్ ఆఫ్ చేసినప్పుడు కూడా ఇలా జరుగుతుంది.
వాట్సాప్ బయో కనిపించకపోవడం
మీరు ఒకరి బయోని ఎక్కువ కాలం చూడలేకపోతే మీరు బ్లాక్ చేయబడే అవకాశం ఉంది.
వాట్సాప్ స్టేటస్ కనిపించకపోవడం
ఎదుటి వ్యక్తి స్టేటస్‌ను ఎక్కువ కాలం చూడకపోతే, మీరు బ్లాక్ చేయబడినట్లు సూచన.
మెస్సేజ్ డెలివరీ చేయబడకపోవడం
మీ మెస్సేజ్ ఎవరికైనా డెలివరీ చేయబడకపోతే, ఆ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండవచ్చు.
వీడియో లేదా వాయిస్ కాల్ పని చేయకపోవడం
వాట్సాప్‌లో ఎవరికైనా కాల్ చేసిన ప్రతీసారి రీచ్ అవ్వకపోతే.. మీరు బ్లాక్ చేయబడ్డారని సంకేతం.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది.